Sep 01,2023 23:42

ప్రజాశక్తి - బాపట్ల
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా శుక్రవారం మండలంలోని బేతపూడిలో విద్యుత్‌ బిల్లులు దగ్దం చేశారు. ఈసంద ర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి సిహెచ్‌ గంగయ్య మాట్లాడుతూ ఆకాశాన్నంటు తున్న నిత్యావసర వస్తువుల ధరలు, ఇష్టానుసారంగా పెంచేస్తున్న విద్యుత్‌ చార్జీలు, చదువుకున్న యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు. వీటిపై ప్రజా పోరాటం చేయాల్సి ఉందన్నా రు. ప్రభుత్వాలపై ప్రజలు సమరభేరి మోగించాలని అన్నారు. సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సచివాలయ కార్యదర్శికి అందజేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు కోట వెంకటేశ్వరరెడ్డి, భోగిరెడ్డి దినేష్‌, సుభాషిని, సాహెబ్‌ రెడ్డి, సుభాని, వెదుళ్ళపల్లి, బేతపూడి సిపిఎం సానుభూతిపరులు పాల్గొన్నారు.
అమతలూరు : ఆగస్టు 30 నుండి సెప్టెంబర్‌ 4వరకు అధికధరలకు నిరసన గా సిపిఎం సమరభేరీ జయప్రదం చేయాలని సిపిఎం వేమూరు కార్యదర్శి బి అగస్టీన్‌ కోరారు. కూచిపూడి సచివాలయం కార్యదర్శి ఎం ఆనంద్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పి రాజు, చావలి రమేష్‌, కె శాంసన్‌, అశోక్‌ పాల్గొన్నారు.
అద్దంకి : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేకం విధానాలను నిరసిస్తూ సిపిఎం సమరబేరి కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీలోని కాకానిపాలెం వార్డ్‌ సచి వాలయంలో సిపిఎం కార్యదర్శి తంగిరాల వెంకటేశ్వర్లు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఇజ్రాయిల్‌, తన్నీరు రాజు, బి విజరు కుమార్‌ పాల్గొన్నారు.
భట్టిప్రోలు : సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన సమరభేరి కార్యక్రమంలో భాగంగా అన్ని సచివాలయాలలో వినతి పత్రం అందజే శారు. శనివారం విద్యుత్‌ బిల్లలు దగ్దం చేయనున్నట్లు సిపిఎం నాయకులు ఎం సత్యనారాయణ తెలిపారు. సిపిఎం నాయకులు బి నాగమల్లేశ్వ రరావు, పి అరోను, టి బసవయ్య, దీపాల సత్యనారా యణ, శ్రీనివాసరావు పాల్గొన్నారు.
చుండూరు : ప్రజాసమస్యలపై సిపిఎం సమరభేరీని జయప్రదం చేయాలని సిపిఎం వేమూరు కార్యదర్శి బి అగస్టీన్‌ కోరారు. చుండూరు మండలం పెదగాదెల వర్రు సచివాలయం కార్యదర్శి కుర్రి శ్రీనివాసరెడ్డికి వినతి పత్రం అందిజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం గ్రామ కార్యదర్శి కె శ్రీమన్నారాయణ, కంఠంనేని హనుమం తరావు, పి నాగరాజు, టి నరసింహరావు, రావూరి ఐజాక్‌ పాల్గొన్నారు.
మార్టూరు రూరల్‌ : ప్రజా సమస్యలపై సిపిఎం నిర్వహిస్తున్న పోరాటాల్లో కలిసి రావాలని సిపిఎం నాయకులు కందిమళ్ల రామకోటేశ్వరరావు, బత్తుల హనుమంత రావు కోరారు. మండలంలోని మార్టూరు, కోలలపూడి, వలపర్ల సచివాలయల ముందు నిరసన చేపట్టారు. కార్యదర్సులకు డిమాండ్స్‌తో కూడిన వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సిపిఎం మార్టూరు కార్యదర్శి ఎనికపాటి రాంబాబు, బొడెంపూడి సూరిబాబు, సిపిఎం వలపర్ల కార్యదర్శి షేక్‌ గఫూర్‌, అహ్మద్‌ షరీఫ్‌, టి సుధాకర్‌ మొగల్‌ ఇబ్రహీం, లంకేశ్వరరావు పాల్గొన్నారు.
కొల్లూరు : అధిక ధరలు, కరెంటు బిల్లులు, నిరుద్యోగ సమస్యలపై సిపిఎం సమర భేరీలో భాగముగా మండలంలోని జువ్వల పాలెం, కిష్కిందపాలెం సచివాలయాల వద్ద టి కష్ణమోహన్‌ కరెంట్‌ బిల్లులను దగ్ధం చేశారు. సచివాలయ కార్యదర్శులకు వినతి పత్రం ఇచ్చారు. ఈపూరు, చిలుమూరు సచివాలయం కార్యదర్శులకు సిపిఎం నాయకులు బి సుబ్బారావు సచివాలయం కార్యదర్శులకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు వేములపల్లి వెంకట రామయ్య, మండవ నాగేశ్వరరావు, వంశీ పోతురాజు, భిక్షాలు, చిట్టిబాబు పాల్గొన్నారు.
బాపట్ల : సిపిఎం చేపట్టిన సమరభేరిలో భాగంగా శుక్రవారం మండలంలోని కుక్కలవారిపాలెంలో సిపిఎం సీనియర్‌ నాయకులు నూతలపాటి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో కరపత్రాలు పంపిణీ చేశారు. సచివాలయం కార్యదర్శికి వినతి పత్రం అందజేశారు. వై భాస్కర రావు, కె నాగేశ్వరరావు, ముసలారెడ్డి, ఏడుకొండల రెడ్డి, రామకష్ణారెడ్డి పాల్గొన్నారు.
పర్చూరు : ప్రజాసమస్యలపై సిపిఎం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్ర మాన్ని నిర్వహించారు. పర్చూరు ఇందిరా కాలనీ, నాగులపాలెం సచివాలయాల్లో వినతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు సిహెచ్‌ మజందర్‌, పర్చూరు నాయకులు ఎం డేవిడ్‌, బి చిన్నదాసు పాల్గొన్నారు.
వేటపాలెం, చిన్నగంజాం : పెంచిన నిత్యవసర ధరలు, విద్యుత్‌ ఛార్జీలు తగ్గించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో శుక్రవారం సచివాలయాల్లో వినతి పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు జి ప్రతాప్‌ కుమార్‌, జీవి రాంప్రసాదరెడ్డి, డి రాఘవులు, జి యాకోబ్‌ పాల్గొన్నారు.
చీరాల : విద్యుత్‌ చార్జీలు, నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలని కోరుతూ సీపీఎం అద్వర్యంలో పట్టణంలోని 25, 31, 32వార్డు సచివాలయలు వద్ద ధర్నా లు నిర్వహించారు. కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి నలతోటి బాబురావు, నాయకులు ఎం వసంతరావు, లింగం జయారాజు, జి సుధాకర్‌, ఎం సత్యమూర్తి, భగవాన్‌ దాస్‌, చెల్లి సురేంద్ర, కె ఆనంద్‌, వెంకటేశ్వర్లు, కె రాజలు పాల్గొన్నారు.
రేపల్లె : సీపీఎం సమారబేరి కార్యక్రమాల్లో భాగంగా 22, 24వార్డు సచివాలయంలో సిపిఎం నాయకులు వినతిపత్రం సమర్పించి నిరసన వ్యక్తం చేశారు. ఓల్డ్‌ టౌన్‌ మార్కెట్‌ దగ్గర ఉన్న సచివాలయం వద్ద రోడ్డు మీద విద్యుత్‌ బిల్లులు తగలబెట్టి నిరసన తెలిపారు. నిరసనలో సీపీఎం పట్టణ కార్యదర్శి సిహెచ్‌ మణిలాల్‌ మాట్లాడారు. కార్యక్రమంలో సిపిఎం పట్టణ నాయకులు కె ఆశ్విరాధం, వై కిషోర్‌, కె రమేష్‌, వై నవీన్‌, ఎం వెంకటేశ్వరరావు, జాన్‌ వెస్లీ, డి శ్రీనివాసరావు పాల్గొన్నారు.