Aug 01,2022 23:30

డి టి శ్రీనివాస్‌ కు వినతి పత్రం అందజేస్తున్న కోరాడ రాజ బాబు

తహశీల్దార్‌ కార్యాలయాల వద్ద నిరసన
టిడిపి ఆధ్వర్యాన వినతిపత్రాల అందజేత
ప్రజాశక్తి- భీమునిపట్నం     
వైసిపి ప్రభుత్వం ఉద్దేశ్య పూర్వకంగానే ప్రజాపంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కోరాడ రాజబాబు ఆరోపించారు. కార్డుదారులకు బియ్యంతోపాటు కందిపప్పు, పంచదార, గోదుమపిండి, జొన్నలు తదితర వస్తువులను టిడిపి హాయాంలో ఇచ్చినట్లుగా అందజేసి రేషన్‌ వ్యవస్థను పరిపుష్టి చేయాలని కోరారు. టిడిపి ఆధ్వర్యంలో తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టి, డిటి శ్రీనివాస్‌కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో 1,2,3,4 వార్డుల టిడిపి అధ్యక్షులు టి సూరిబాబు, బడిగంటి నీలకంఠం, గంటా నూకరాజు, పాసి నరసింగరావురావు, ఎస్సీ సెల్‌ నియోజకవర్గ అధ్యక్షులు పతివాడ రాంబాబు, నాయకులు పిట్ట సురేష్‌, కాసరపు నాగరాజు పాల్గొన్నారు.
సీతమ్మధార :రేషన్‌ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మాజీమంత్రి, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆదేశాలతో నియోజకవర్గ ఇన్‌ఛార్జి విజరుబాబు ఆధ్వర్యంలో విశాఖ అర్బన్‌ తహశీల్దార్‌ కార్యాలయం టిడిపి నేతలు ఆందోళన చేపట్టి, వినతిపత్రం అందజేశారు.
పెందుర్తి : కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఉచిత బియ్యాన్ని కొందరికే పరిమితం చేయడాన్ని నిరసిస్తూ టిడిపి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. తహశీల్దార్‌ ఆనంద్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో జివిఎంసి టిడిపి ఫ్లోర్‌లీడర్‌ పీలా శ్రీనివాసరావు నిరసనలో పాల్గొని, వివిధ కారణాలతో రద్దు చేసిన రేషన్‌ కార్డులను పునరుద్ధరించాలని, రంజాన్‌, క్రిస్మస్‌, సంక్రాంతికి గతంలో ఇచ్చినట్లుగా రేషన్‌కానుకలను పునరుద్ధరించాలని కోరారు. మండల టిడిపి అధ్యక్షులు కరక దేముడు, రెడ్డి నారాయణరావు జెర్రిపోతులపాలెం, జంగాలపాలెం, సరిపల్లి సర్పంచులు మడక అప్పలరాజు గొరపల్లి నరసింహారావు గొర్లె రామకృష్ణ పాల్గొన్నారు
పద్మనాభం : నిరుపేదలకు ఆహర భద్రత కల్పించాలని డిమాండ్‌ చేస్తూ మండల టిడిపి అద్యక్షులు కోరాడ రమణ ఆధ్వర్యంలో మండల రెవెన్యూ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టి, తహశీల్దార్‌ లోకేశ్వరరావుకు వినతిపత్రం ఆందించారు. టిడిపి హయాంలో గతంలో రేషన్‌డిపోల్లో ఇచ్చే తొమ్మిది సరుకులను పునరుద్ధరించాలని కోరారు. టిడిపి రాష్ట్రఉపాధ్యక్షురాలు కురిమిన లీలావతి.మాజీ జెడ్‌పిటిసి కె దామోదరరావు, పద్మనాభం ఎంపిటిసి కె లక్ష్మనాయకులు, శ్రీను, అప్పలనాయుడు పాల్గొన్నారు.
ఆనందపురం: పిఎం గరీబ్‌ కల్యాణ్‌ అన్నయోజన కింద కేంద్రం ఇస్తున్న బియ్యం తెల్లరేషన్‌ కార్డు కలిగిన వారందరికీ అందించాలనిభీమిలి నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి బాబు కోరారు. దీనిపై తహశీల్దార్‌కు వినతిపత్రం అందించారు. టిడిపి నేతలు మీసాల సత్యనారాయణ, గన్రెడ్డి రమేష్‌, గుండు చిన్న బాబు, ఎంపిటిసిలుపడాల అప్పలనాయుడు దొంతల కనకరాజు, రెడ్డిబాబు లోడగల వెంకట్రావు,ఎర్ర బంగారు నాయుడు( బన్నీ), సింయాద్రి సతీష్‌, ముమ్మన్న శ్రీను, సారికి విజయకుమార్‌, వెల్లంకి దొరబాబు,కోరాడ అప్పలరాజు, కోరాడ రాంబాబుకొవ్వాడ నగేష్‌, పతివాడ రవిశంకర్‌, బంటుపల్లి రాజు పాల్గొన్నారు.