
ప్రజాశక్తి-యంత్రాంగం
కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఎం, సిపిఐ ప్రచారభేరి కార్యక్రమాల్లో వక్తలు పిలుపునిచ్చారు.
ఉక్కునగరం : స్టీల్‌ప్లాంట్‌ను ఉద్దేశ్యపూర్వకంగా నష్టాల్లోకి నెట్టి ప్రయివేటీకరించాన్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టాలని సిపిఎం, సిపిఐ నేతలు పిలుపునిచ్చారు 78వ వార్డు ఉక్కునగరం సెక్టర్ 9 వద్ద రైతుబజార్‌లో ప్రచారభేరి చేపట్టారు.సెక్టర్ 11 వరకు పాదయాత్ర చేపట్టారు. కరపత్రాలు పంపిణీ చేశారు.ప్రభుత్వ రంగాన్ని రక్షించుకుంటేనే దేశానికి భవిష్యత్తు ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా కార్మిక కర్షక వ్యతిరేక విధానాలకు స్వస్తి పలికే వరకు పోరాటాలను కొనసాగిద్దామన్నారు. సిపిఎం కార్పొరేటర్ గంగారావు, స్టీల్‌జోన్ సిపిఎం కార్యదర్శి శ్రీనివాసరాజు, చిరంజీవి, పుల్లారావు, కె పి సుబ్రహ్మణ్యం, గరీశంకర్, దత్తాత్రేయ రాజు, సిపిఐ నాయకులు టి కనకరాజు, జి బోసుబాబు, పెద్దిరాజు, రాజబాబు పాల్గొన్నారు.
ములగాడ : 63వ వార్డు కాకరలోవ చింతల్లోవ క్రాంతినగర్ ప్రాంతాల్లో సిపిఎం, సిపిఐ ప్రచారభేరి పాదయాత్రను సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి మరడాన జగ్గునాయుడు ప్రారంభించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ మతోన్మాద విచ్ఛిన్నకర విధానాలతోపాటు, స్టీల్‌ప్లాంట్ వంటి ప్రభుత్వరంగ సంస్థల ప్రయివేటీకరణ ద్వారా కార్పొరేట్‌లకు ఊడిగం చేసే చర్యలకు చరమగీతం పాడాలంటే మోడీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. పాదయాత్రలో సిపిఎం జోన్ నేతలు కె.పెంటారావు, రాజు, గోవింద్, నరేష్, రామకృష్ణ, సత్యనారాయణ, రమణ, నగేష్, కిషోర,్ సిపిఐ నేతలు కె.సత్యాంజనేయ, జి.రాంబాబు. జి.అప్పారావు పాల్గొన్నారు.
పెందుర్తి: లక్షమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగం, ఉపాధి కల్పిస్తున్న విశాఖ స్టీల్‌ప్లాంటును అమ్మకానికి పెట్టడం ద్వారా రాష్ట్ర ప్రజలకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీరని ద్రోహం చేస్తోందని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం.పైడిరాజు విమర్శించారు. 97వ వార్డు ఎస్‌సి, బిసి కాలనీలు, రైతు బజార్ ఏరియాలలో ప్రచారభేరి నిర్వహించారు. ప్రచారభేరిలో భాగంగా ఈనెల 26న కూర్మన్నపాలెం నిర్వహించే బహిరంగ సభకు సిపిఎం పోలిట్‌బ్యూరో సభ్యులు బి.రాఘవులు, సిపిఐ జాతీయ సమితి కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ పాల్గొంటారన్నారు.పెందుర్తి ఏరియా సిపిఐ కార్యదర్శి ఆర్.శ్రీనివాసరావు, సిపిఐ జిల్లా నాయకులు వై.రాంబాబు, వామపక్షాల కార్యకర్తలు రమణ, రాము, అప్పలనాయుడు, ఐ. రమణ పాల్గొన్నారు.
తగరపువలస : కేంద్రప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక మెయిన్ రోడ్డు నుంచి హైవే వరకు ప్రచారభేరి పాదయాత్ర నిర్వహించారు. ఈ నెల 26న బహిరంగ సభ ను జయప్రదం చేయాలని కోరారు కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు ఆర్‌ఎస్‌ఎన్ మూర్తి, రవ్వ నరసింగరావు, ఎస్ అప్పలనాయుడు, కె నాగరాణి, కానూరి రాంబాబు, ఎం అప్పలరాజు, ఎన్ ఆదినారాయణ, గోవిందరావు పాల్గొన్నారు
మధóురవాడ : పెట్రో ఉత్పత్తుల ధరల పెంపుతో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల జీవనాన్ని దుర్బరం చేస్తోందని మధురవాడజోన్ సిపిఎం, సిపిఎం నేతలు మండిపడ్డారు. జోన్ పరిధిలో ప్రచారభేరి పాదయాత్రలను నిర్వహించారు. వామపక్ష నేతలు డి అప్పలరాజు, వి సత్యనారాయణ, బి భారతి, కుమార్, జి.కిరణ్, త్రినాథ్, సిహెచ్ శేషుబాబు పాల్గొన్నారు.
సీతమ్మధార : విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియ నిలిపేయడంతోపాటు పూర్తిస్థాయి సామర్థ్యంతో పనిచేసేలా చర్యలు చేపట్టాలని అక్కయ్యపాలెం జోన్ సిపిఎం నేత రాజు డిమాండ్ చేశారు. నరసింహనగర్ రైతుబజార్ వద్ద కరపత్రాలు పంపిణీ చేశారు. 44 కార్మిక చట్టాలను రద్దు చేసి, నాలుగు లేబర్ కోడ్స్‌ను అమల్లోకి తేవడం ద్వారా కార్మికులను యాజమాన్యాలకు కట్టుబానిసలు చేసేలా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వ్యవహరించిందన్నారు, .కార్యక్రమంలో సిపిఎం నాయకులు గౌరీష్ మాధవి జ్యోతి ప్రకాష్ లక్ష్మీపతి పాల్గొన్నారు.
ములగాడ : మల్కాపురం, ప్రకాష్‌నగర్, వెంకన్నపాలెం, ఎస్‌సి కాలనీ ప్రాంతాల్లో సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో ఇంటింటా కరపత్రాలు పంచుతూ ప్రచారభేరి నిర్వహించారు. మల్కాపురం జోన్ సిపిఎం నేత పైడిరాజు, పెంటారావు, సిపిఐ సీనియర్ నేత నూనెల సూరిబాబు, మగ్గం సత్యానందరావు, ఎన్‌వి త్రినాథ్, మధుసూదనరావు, డి గోపి పాల్గొన్నారు.
ఆరిలోవ : సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో ఆరిలోవ జోన్ నేతలు 12వ వార్డులో ప్రచార భేరీ నిర్వహించారు. వార్డులోని పలు కాలనీలో పర్యటించారు. వామపక్ష నేతలు ఎస్.కె.రెహ్మాన్, వి.నరేంద్రకుమార్, ఎస్.రంగమ్మ, పి.శంకర్, బి.రత్నం, శ్రీనివాస్, కె.సన్యాసమ్మ, ఎం.లకీë, బి.సన్యాసిరావు పాల్గొన్నారు.
ఎంవిపి కాలనీ : జివిఎంసి 16వ వార్డు ఇసుకతోట రజక వీధి, అంబేద్కర్‌నగర్‌లో సిపిఎం, సిపిఐ ఆధ్వర్యాన పాదయాత్ర నిర్వహించారు. ఇంటింటికీ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు పడాల గోవిందు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వి.కృష్ణారావు, జివిఎన్.చలపతి, పివెంకటరావు, ప్రియాంక. కుమారి, నాయుడు, చంటి, ఎఐటియుసి రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ, సిపిఐ నాయకులు సిపిఐ ఎన్.మధురెడ్డి, అశోక్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్ : సిపిఎం జగదాంబ జోన్ కమిటీ ఆధ్వర్యాన ఎం.సుబ్బారావు అధ్యక్షతన పూర్ణా మార్కెట్ దరి దుర్గాలమ్మ గుడి, స్టేడియం వెనుక రోడ్డు, పాత బస్టాండ్, ప్రసాద్ గార్డెన్స్,
కల్లుపాకల, రామకృష్ణ థియేటర్ వెనుక వీధి ప్రాంతాల్లో కరపత్రాలు పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె.చంద్రశేఖర్, సిపిఎం నాయకులు వై.రాజు, సిఐటియు జోన్ ప్రధాన కార్యదర్శి చంద్రమౌళి, డివైఎఫ్‌ఐ నాయకులు సంతోష్, మెడికల్ రిప్స్ నాయకులు హరి, కళాధర్, హోటల్ కార్మిక నాయకులు రామారావు, ముఠా కార్మికుల నాయకులు పాల్గొన్నారు.
అల్లిపురం మార్కెట్, కెప్టెన్ రామారావు జంక్షన్, అచ్చియ్యమ్మపేట ప్రాంతాలలో ఇంటింటికీ కరపత్రాలు పంపిణీచేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మరుపిళ్ల పైడిరాజు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సిఎన్.క్షేత్రపాల్, జి.ఫణింద్ర, జి.లక్ష్మణరావు, ఎం.శ్రీనివాస్, భరత్, నాయుడు తదితరులు పాల్గొన్నారు.
పరవాడ : మండలంలోని గొర్లివానిపాలెం గ్రామంలో సిపిఎం నాయకులు రాజకీయ ప్రచార భేరి కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల నాయకులు అనకాపల్లి నాగేశ్వరరావు, పి.మాణిక్యం మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక నిరంకుశ మతోన్మాద బీజేపీని సాగనంపుదాం.. దేశాన్ని కాపాడుకుందాం అనే నినాదంతో ప్రజలను చైతన్యం చేయడానికి ఈ కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. బిజెపి పాలనలో దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. అన్నదమ్ములా ఉన్న ప్రజల మధ్య మోడీ అమిత్‌షా నాయకత్వంలో బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ కూటమి మత విధ్వేషాలను రెచ్చగొడుతుందని విమర్శించారు. మరోవైపు అదాని, అంబానీలకు దేశ సంపదను, ప్రభుత్వ రంగ సంస్థలను దోచిపెడుతుందని తెలిపారు. డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలను భారీగా పెంచిందన్నారు. ఈ కార్యక్రమంలో గొర్లివానిపాలెం గ్రామస్తులు పాల్గొన్నారు.
సిపిఐ ఆధ్వర్యాన బైక్ ర్యాలీ
కె.కోటపాడు : మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై చేపట్టిన ప్రచార భేరిలో భాగంగా కె.కోటపాడు, దేవరాపల్లి మండలాల్లో నిర్వహించే బైక్ ర్యాలీని కె.కోటపాడులో సిపిఐ జిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ ఆదివారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ ఎ.కోడూరు, వారాడ, ఆనందపురం మీదుగా దేవరాపల్లి చేరుకుంది. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు, విశాఖ రైల్వే జోన్ విషయంలో మోడీ ప్రభుత్వం రాష్ట్రానికి ద్రోహం చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు రాజాన దొరబాబు, ఎం.రామునాయుడు, డిసిహెచ్ క్రాంతి, గొర్లె దేవుడు బాబు, రెడ్డి అప్పలనాయుడు, ఇల్లాకు రాము, సిపిఎం నాయకులు ఎర్ర దేవుడు, గాడి ప్రసాద్ పాల్గొన్నారు.