కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై మోపుతున్న అధిక భారాలను నిరసిస్తూ సిపిఎం రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా సోమవారం అన్నమయ్య, వైఎస్‌ఆర్ కడప జిల్లాల్లో సమరభేరి నిర్వహించారు. ఆయా మండల కేంద్రాల్లోని తహశీల్దార్ కార్యాలయాల వద్ద ప్రజలు పెద్ద ఎత్తున హాజరై ధర్నాల ద్వారా ప్రభుత్వాలపై వ్యతిరేకతను వెల్లడించారు. రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసరాలు, పెట్రోల్, డిజిల్, గ్యాస్ ధరలు, రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న పన్నులపై తమ నిరసనను వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని, రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో బిజెపిని, రాష్ట్రంలో వైసిపిని ఓడించాలని సిపిఎం పెద్ద ఎత్తున నినాదాలు చేసింది. ప్రజాశక్తి - కడప అర్బన్
ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ సామాన్య మధ్య తరగతి ప్రజలను ఇబ్బందులు పెడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దింపాల్సిన అవసరమెంతైనా ఉందని, పన్నులు, అధిక భారాలు మోపుతున్న బిజెపి, వైసిపిని వ్యతి రేకించి దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడలని సిపిఎం జిల్లా కార్యదర్శి జి. చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. సోమవారం సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఉన్న గాంధీ విగ్రహం ఎదుట దేశ వ్యాప్త పిలుపులో భాగంగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి గడిచిన తొమ్మిది సంవత్సరాల పరిపాలనలో ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానమూ నెరవేర్చలేదని వాపోయారు. జీరో బ్యాంక్ అకౌంట్ కల్గిన ప్రతి ఒక్కరికీ నల్లధనంలో నుంచి రూ.15 లక్షలు జమ చేస్తానని చెప్పి మరీ మరిచారని వాపోయారు. ప్రతి సంవ త్సరమూ కోటి మంది యువతీ, యువకులకు ఉద్యోగ అవ కాశాలు కల్పిస్తానని చెప్పి ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ తొమ్మిదేళ్ల పాలనలో ప్రతి గ్యాస్ బండ పైన రూ.900 పెంచి ఎన్నికల ముందు రూ.200 తగ్గించి తగ్గించినట్టుగా ప్రచారం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. చింతకొమ్మదిన్నె : మండలంలో వర్షాభావ పరిస్థితులతో వేసిన పంటలు ఎండిపోయాయని నష్టపోయిన రైతులకు ఇ- క్రాఫ్ చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి.దస్తగిరిరెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గోపాలకష్ణయ్య మండల కార్యదర్శి చిన్న సిద్దయ్య పాల్గొన్నారు. పెండ్లిమర్రి : పెండ్లిమర్రి, వెల్లటూరు గ్రామాలకు చెందిన ఎస్‌సి, ఎస్‌టిలకు ఇళ్ల స్థలాలు, సాగు భూములకు పట్టా లివ్వాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వి.అన్వేష్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు శ్రీని వాసులు, మల్లేష్, సుంకమ్మ, నందిని, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఉత్తయ్య, బాల గంగయ్య, లక్ష్మీనరసయ్య, తిరుపతయ్య, లక్ష్మమయ్య, గంగయ్య, ఓబులేసు పాల్గొన్నారు. ఒంటిమిట్ట : అధిక ధరలు, విద్యుత్ భారాలు, పన్నుల పెంపు వంటి వాటిని నిరసిస్తూ తహశీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఎం నాయకులు ధర్న చేపట్టారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు ప్రసాదు, నరసింహులు, సాంబయ్య, లక్ష్మీనా రాయణ, రాజు, మహిళలు పాల్గొన్నారు. పోరుమామిళ్ల : మోడీ సర్కారు రెండోసారి గద్దెనెక్కిన తర్వాత కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇంతవరకు ఉద్యోగాల ఊసే లేదని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి భైరవ ప్రసాద్ పేర్కొన్నారు. కార్యక్ర మంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు షేక్ గౌసియాబేగం, వరలక్షుమ్మ, కుసులూరు రవి, రత్నం, నజీర్, మున్నీ, లూర్దుమేరి, పార్టీ సభ్యులు పాల్గొన్నారు. ప్రొద్దుటూరు (పుట్టపర్తి సర్కిల్ ): కేంద్ర ప్రభుత్వం తన అసమర్ధ పాలనతో నిత్యావసర వస్తువులు, గ్యాస్, పెట్రోల్, డీజిల్, విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని సిపిఎం నాయకులు సత్యనారాయణ పేర్కొన్నారు. కార్యక్రమంలో సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు ముంతాజ్ బేగం ,మహిళా సంఘం కార్యదర్శి వెంకటసుబ్బమ్మ, భానుమతి, సర్వేశ్వరీ, లక్ష్మీదేవి, రాములమ్మ, చెన్నారెడ్డి, బాబు పాల్గొన్నారు. బ్రహ్మంగారిమఠం : సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్మ్రంలో సిపిఎం మండల కార్యదర్శి సానా గోవింద్ స్వామి, ఎర్రంపల్లి అజరు, భాస్కర్, నాయకులు శీను, రమణ రాజశేఖర్, రమేష్ పాల్గొన్నారు. బద్వేలు : నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, పెరిగిన నిత్యవసర వస్తు వులను తగ్గించాలని, గ్యాస్, పెట్రోల్ రేట్లు తగ్గించాలని సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి కె.శ్రీను, సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు చాంద్ బాషా , పట్టణ కమిటీ సభ్యురాలు మోక్షమ్మ, ఆనంతమ్మ, సిఐటియు నాయకులు రమణ, రాజగోపాల్, సభ్యులు నాగార్జున, షరీఫ్, సురేంద్ర, బాలగురయ్య, గురుదేవి, రవికుమార్, శాఖా కార్యదర్శులు బాబయ్య, చిన్నయ్య, ఐద్వా నాయకులు రత్నమ్మ, గౌతమి , బాలమ్మ, మస్తాన్ బీ, కళావతి, దేవి పాల్గొన్నారు. జమ్మలమడుగు రూరల్ : ప్రజలపై పన్నుల భారాలు వేస్తున్న ప్రధా నమంత్రి, ముఖ్యమంత్రి విధానాలపై పోరాడాలని సిపిఎం పట్టణ కార్యదర్శి వీరనాల శివ నారాయణ పిలుపునిచ్చారు. ఆర్‌డిఒ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కార్యక్ర మంలో డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి శివకుమార్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు వినరు కుమార్, సిపిఎం నాయకులు దాసు, ప్రసాద్ రెడ్డి, మైలవరం మండల కార్యదర్శి కొండయ్య, లక్ష్మి నారాయణ, సంజీవ రాయుడు, గొరిగే.కష్ణ, శేషయ్య, సుభహన్, రాఘవ, సూరి, శంకర్, ప్రజలు పాల్గొన్నారు. మైదుకూరు : అధిక ధరలు, కరెంటు ఛార్జీలు తగ్గించాలని, నిరుద్యోగ సమస్య పరిష్క రించాలని కోరుతూ మైదుకూరు తహశీల్దారు కార్యాలయాల ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తహశీల్దార్ అనురాధ కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి షరీఫ్, సిపిఎం నాయకులు పాల్గొన్నారు.










