Sep 04,2023 21:04

రాయచోటి : ధర్నా చేస్తున్న సిపిఎం నాయకులు

మదనపల్లె అర్బన్‌ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధా నాలకు వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం తహశీల్దార్‌ కార్యాల యాల ఎదుట ధర్నాలు నిర్వహించారు. పెంచిన విద్యుత్‌ ఛార్జీలు, నిత్యాసర వస్తువుల ధరలు, పెట్రోలు, డీజిల్‌ చార్జీలు తగ్గించాలని, గ్యాస్‌ సిలిండర్‌ రూ.400లకు ఇవ్వాలని, ప్రభుత్వ రంగంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు మాట్లాడుతూ బిజెపి అధికారంలోకి వచ్చిన నాటి నుండి గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రోజురోజుకీ పెంచుకుంటూ పోతుందని, గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.450ల నుండి రూ.1150లకు పెంచి దన్నారు. ఎన్నికల ముందు రూ.200 తగ్గించి గొప్పగా చెప్పుకుంటున్నదని విమర్శించారు. అధికారంలోకి రాగానే సంవత్సరానికి 2 కోట్లు ఉద్యోగాలు కల్పిస్తామని మోడీ చేసిన ఎన్నికల వాగ్దానం నీటిపై రాతలుగా మారాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు అన్నం పెడుతున్న ఉపాధి హామీ పథకానికి నిధులు కత్తిరిస్తుందని, వచ్చే అరకొర నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మల్లిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి దాసోహం అంటూ బిజెపి తెచ్చిన 2020 విద్యుత్‌ సవరణల చట్టం ద్వారా వైసిపి ప్రభుత్వం ట్రూ ఆఫ్‌, సర్దుబాటు పేర్లతో విద్యుత్‌ ఛార్జీలు విపరీతంగా పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి డి.ప్రభాకర్‌రెడ్డి, నాయకులు వెంకటేశ్‌, నాగరాజు, రఘునాథ్‌, అంజాద్‌ ఖాన్‌, అశోక్‌, రమణ పాల్గొన్నారు. అనంతరం తహశీల్దార్‌ ఛాంద్‌కు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. రాయచోటి టౌన్‌ : అధిక ధరలు, నిరుద్యోగం, పెరుగు తున్న విద్యుత్‌ చార్జీల నివారణకు విద్యుత్‌ రంగాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎ.రామాంజులు తెలిపారు. తాశీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ కేంద్రం విధిస్తున్న షరతులకు తలొగ్గి రాష్ట్రం ఇష్టం వచ్చినట్లు భారాలు మోపు తోందన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రం డిప్యూటి తాశీల్దార్‌కు అంద జేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు కె.నాగబసిరెడ్డి, ఫయాజ్‌, ఓబులేసు, గంగయ్య, అనిల్‌, మాధవి, రెడ్డెయ్య పాల్గొ న్నారు. రాజంపేట అర్బన్‌ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి నిత్యావసర ధరలు తగ్గించి నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు రవికుమార్‌ డిమాండ్‌ చేశారు. తహశీల్దార్‌ కార్యాలయం ధర్నా నిర్వహించారు. అనంతరం తహశీల్దార్‌ సుబ్రహ్మణ్యంరెడ్డికి వినతి పత్రం సమర్పిం చారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపా ధ్యక్షులు రమణ, నాయ కులు సతీష్‌, సిఐటియు నాయకులు ఓబయ్య, లక్ష్మీదేవి, ప్రసాద్‌, సునీల్‌ రమణయ్య, సుబ్ర హ్మణ్యం, భాష పాల్గొన్నారు. రైల్వేకోడూరు : సిపిఎం ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కేంద్రంలో బిజెపి ప్రభు త్వం ప్రజా వ్యతిరేక విధానాల్ని నివసిస్తూ తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిం చారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సిహెచ్‌ చంద్రశేఖర్‌, సిపిఎం మండల శాఖ కార్యదర్శి లింగాల యానాదయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బొజ్జ శివయ్య, నాయకులు పులగంటి శ్రీనివా సులు, ముత్యాల శ్రీనివాసులు, విజరు, శంకర్‌ రాజు, కెవిపిఎస్‌, మండల కార్యదర్శి ఎన్‌.పెంచ లయ్య, కె కేశవులు, ఆనంద్‌, దేసయ్య నర్సింలు, నాగరాజు, వంశీకృష్ణ, ప్రసాదు పాల్గొన్నారు. బి.కొత్తకోట : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఆవలంభిస్తున్న విధానాలతో దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం పిటిఎం మండల కార్యదర్శి మావిళ్ల వెంకటాచలపతి విమర్శించారు. తహశీల్దార్‌ విద్యాసాగర్‌కు సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంబేపల్లె : పెంచిన ధరలను తగ్గించాలని కోరుతూ తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు ఎస్‌.రామచంద్ర, వలి, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. తహశీల్దార్‌ మహేశ్వరి బారుకి వినతి పత్రం అందజేశారు.