
ప్రజాశక్తి - కురుపాం : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలకు ప్రజలు సిద్ధంగా ఉండాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు పిలుపునిచ్చారు. మండలంలోని గుజ్జువాయి సచివాలయం వద్ద స్థానిక సమస్యలపై శుక్రవారం ధర్నా నిర్వహించి అనంతరం సచివాలయ కార్యదర్శికి వినతి పత్రం అందించారు. గుజ్జువాయి పంచాయితీ పరిధిలో గల డి.బారామని, బారామని, కాలనీగూడల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సంతకాలు సేకరించి గుజ్జువాయి సచివాలయం వద్ద నిరసన తెలిపారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజలపై భారాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోపుతున్నాయని, అడవులను అదానీకి ధారదత్తం చేయడానికి కేంద్రం చూస్తుంటే పూర్తిగా గిరిజన హక్కులను కాలరాయడానికి చూస్తుందని అన్నారు. కావున కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 4న మండలం తహశీల్దార్ కార్యాలయం వద్ద నిర్వహించబోయే ధర్నాకు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు వి.వాసు, వైకంఠ, అంగధ, సుబ్బారావు, పార్వతి, పి.శయమే తదితరులు పాల్గొన్నారు.
పాలకొండ: సిపిఎం సమరభేరి కార్యక్రమంలో భాగంగా మండలంలోని సింగన్న వలస, వెలగవాడ, పాలకొండ పట్టణంలోని గారమ్మ కాలనీలో, 3,5 వార్డులకు సంబంధించి ఎన్ కె రాజపురం సచివాలయం వద్ద నిరసన తెలిపి, వినతులు అందజేశారు. కార్యక్రమంలో సిపిఎం మండల కన్వీనర్ డి.రమణారావు, మండల కమిటీ సభ్యులు డి.దుర్గారావు, ఎ.భానుచందర్, వై.చంప, ఎస్.జోషి, ఎస్.చిన్నారావు, ఎస్.మల్లేష్, ఎస్.సింహాచలం, ఎస్.సాంబయ్య, దూసి దుర్గారావు, డి.జగన్నాథం, జి.లక్ష్మణరావు, ఎం.దుర్గారావు, కాద రాము, పడాల వేణు, చింతల సంజీవ్, అర్థముడి లక్ష్మణరావు ఎ.లక్ష్మణరావు ఎం రమేష్ జి హేమ్ సుందర్ రావ్ పట్టణ పౌరులు పి రమణ తదితరులు నిరసన తెలిపారు.
సాలూరు: ప్రజాసమస్యలను పరిష్కరించాలని కోరుతూ పట్టణంలోని సచివాలయాలలో సిపిఎం ఆధ్వర్యాన వినతులను అందజేశారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎన్నై నాయుడు ఆధ్వర్యాన పట్టణం లోని 6,7,8,9,12 సచివాలయాలలో పార్టీ నాయకులు వినతి పత్రాలను సమర్పించారు. 6,7వార్డు సచివాలయంలో సిపిఎం పట్టణ నాయకులు టి.వెంకటరావు, టి.రాముడు ఆధ్వర్యాన వేదసమాజం వద్ద ఉన్న 8,9 వార్డుల సచివాలయం లో సిపిఎం నాయకులు కేరంగి వెంకట్రావు, జె.శేఖర్, బంగారమ్మపేట సచివాలయంలో సిపిఎం నాయకులు మంగమ్మ, నితిన్, రమేష్ ఆధ్వర్యాన వినతులు అందజేశారు.
గుమ్మలక్ష్మీపురం : మండలంలోని గుమ్మలక్ష్మీపురం, ఎల్విన్‌పేట, ఇరిడి, కుక్కిడి, డుమ్మంగి, తాడికొండ, లుంబేసు, దుడ్డు ఖల్లు సచివాలయాలు వద్ద సిపిఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం సిపిఎం మండల కార్యదర్శి కోలక అవినాష్ ఆధ్వర్యాన జిల్లా కమిటీ సభ్యులు మండంగి రమణ, సిఐటియు మండల కార్యదర్శి కె గౌరీశ్వరరావు, మండల నాయకులు ఎం.సన్యాసిరావు, సుబ్బారావు, పాండురంగారావు తదితరులు వినతులు అందజేశారు.
సీతానగరం: మండలంలోని బూర్జ, లక్ష్మిపురం, నిడగల్లు, రంగమ్మపేట, ఆర్.వెంకమ్మపేట సచివాలయాల వద్ద సిపిఎం మండల కార్యదర్శి రెడ్డి ఈశ్వరరావు, జి.వెంకటరమణ ఆధ్వర్యాన నిరసన కార్యక్రమాలు జరిగాయి. అనంతరం ప్రజల వద్ద నుంచి చేసిన సంతకాలను ఆయా గ్రామ సచివాలయ అధికారులకు అందజేశారు. ఈనెల 4న తహశీల్దార్ కార్యాలయాల వద్ద జరగనున్న నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు డి.నారా యణరావు, ఎం.సింహాచలం, కె.నానిబాబు, రమణమూర్తి, రెడ్డి సత్యనారాయణ, యాళ్ల ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
గుమ్మలక్ష్మీపురం : జియమ్మవలస మండలం అలమండ, జియ్యమ్మవలస సచివాలయాల ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొల్లి గంగనాయుడు ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పాచిపెంట : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో పనుకువలస సచివాలయం వద్ద సిపిఎం నాయకులు సుర్రు రామారావు, సిహెచ్.సింహాచలం. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోరాడ ఈశ్వరరావు ఆధ్వర్యంలో సచివాలయం కార్యదర్శికి వినతిని అందజేశారు. కార్యక్రమంలో మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు.
సీతంపేట: మండలంలోని దారపాడు గ్రామ సచివాలయం వద్ద ప్రభుత్వం విధానాలపై సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. సంతకాలు చేసి వినతిపత్రం సచివాలయం కార్యదర్శికి అందజేశారు. ప్రజా సమస్యలపై తెలియజేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎం.తిరుపతిరావు, జె.శ్రీరాములు, పి.సాంబయ్య, కె.దుర్గారావు, సర్పంచ్ జె. సుందరమ్మ తదితరులు పాల్గొన్నారు.
సాలూరురూరల్ : సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో మండలంలోని మరిపల్లి, అన్నంరాజు వలస, నార్లవలస, జీగిరాం గ్రామ సచివాలయాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి మర్రి శ్రీనివాసరావు, మండల కమిటీ సభ్యులు వంతల సుందర్రావు, కోనేటి చినబాబు, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు సిద్ధ సాయిబాబా, కె.లక్ష్మి, ఆర్.లక్ష్మి, సిహెచ్ సుశీల, కె.పొన్నాలు, భాస్కరరావు, ఆదినారాయణ, తాడంగి ఘాసి, గబడారి శ్రీను తదితరులు పాల్గొన్నారు.
గరుగుబిల్లి: మండలంలోని గొట్టివలస, రావుపల్లి, శివం సచివాలయంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు యమ్మల మన్మధరావు ఆధ్వర్యాన వినతి పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో కార్యక్రమంలో గేదెల రామ్మూర్తి నాయుడు, ప్రకాశం, సాంబయ్య, శివ, సింహాచలం, శ్రీను పాల్గొన్నారు.
కొమరాడ : మండలంలోనికొమరాడ, పూడేసు, చోలపదం, ఉలిపిరి, కుంతేసు, గుమడ సచివాలయాల వద్ద సిపిఎం ఆధ్వర్యాన నిరసన తెలిపి వినతి పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వి.ఇందిర, జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి, నాయకులు ఉపేంద్ర, బిడ్డిక దాలయ్య, శివున్నాయుడు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఈనెల 4న తహశీల్దార్ కార్యాలయం వద్ద జరుగు ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
పార్వతీపురంటౌన్ : మున్సిపల్ పరిధిలో గల 1,15 సచివాలయాల వద్ద సిపిఎం నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. అనంతరం సచివాలయాల కార్యదర్శులకు వినతి పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి గొర్లి వెంకటరమణ, పట్టణ కమిటీ సభ్యులు రెడ్డి శ్రీదేవి, పాకల సన్యాసిరావు, బంకురు సూరిబాబు, సంచాన ఉమా, రాజశేఖర్, పార్టీ సభ్యులు గెద్ద తులసి, మాన్యం గౌరమ్మ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వెంకటరమణ మాట్లాడుతూ ఈనెల 4న తహశీల్దారు కార్యాలయం వద్ద తలపెట్టిన నిరసనను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
పార్వతీపురం రూరల్: మండలంలోని సంఘం వలస సచివాలయం ఎదుట జిల్లా కమిటీ సభ్యులు, రావికోన సర్పంచ్ కె రామస్వామి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం సచివాలయ సిబ్బందికి వినతి అందించారు. కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు కె.శంకర్రావు, సింహాచలం, రైతు సంఘం నాయకులు సత్యనారాయణ, పలువురు రైతులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారం కోరుతూ సిపిఎం బైక్ ర్యాలీ
బలిజిపేట : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన ధరలు తగ్గించాలని, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని, పెంచిన కరెంటు చార్జీలు తగ్గించాలని సిపిఎం రాష్ట్రవ్యాప్తంగా సమరభేరి కార్యక్రమంలో సందర్భంగా శుక్ర వారం మండలంలోని బైక్ ర్యాలీ జరిగింది. బలిజిపేట, నారాయణపురం, పెద్దింపేట, వెంగాపురం, తుమరాడ, పలగర, మిర్తివలస, బర్లి, అంపావల్లి గ్రామాల్లో నిరసన కార్యక్రమలు చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు యమ్మల మన్మధ రావు, సీనియర్ నాయకులు గేదెల సత్యనారాయణ మాట్లాడుతూ ధరలు తగ్గించాలని, ఉద్యోగాలు ఇవ్వాలని, విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, ఉపాధిహామీ వేతనం రూ.600 కూలి, 200 రోజులు పని దినాలు కల్పించేంత వరకూ పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమాల్లో చిప్పాడ సుబ్బయ్య, నులకమజ్జి త్రినాధ, బి.భానుమూర్తి, ఆవు, సాంబమూర్తి, గౌరీశ్వరరావు, ఎ.కోటి, కృష్ణమురళి, సంతు, వెన్నెల వేణు పాల్గొన్నారు.










