కొమరాడ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలు తిప్పుకొట్టాలని సిపిఎం రాష్ట్ర నాయకులు మర్రాపు సూర్యనారాయణ పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై దేశ వ్యాప్త సమరభేరి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని అన్ని మండల కార్యాలయాల వద్ద సిపిఎం ఆధ్వర్యాన సోమవారం నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఇందులో భాగంగా కొమరాడలో జరిగిన నిరసనలో పాల్గొన్న సూర్యనారాయణ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ఆర్థిక విధానాలు రైతులను, కార్మికులను, సామాన్యులను, వ్యవసాయ కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసేలా ఉన్నాయని అన్నారు. ఇలాంటి సందర్భంలో విద్యుత్ సంస్కరణల ప్రభావంతో విద్యుత్ ఛార్జీలు భారీగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు ఎంతో మేలు చేసే వ్యవసాయ ఉచిత విద్యుత్ పథకాన్ని రద్దు చేసే కుట్ర కేంద్ర ప్రభుత్వం చేస్తుంటే దానికి రాష్ట్ర ప్రభుత్వం మద్దతు పలకడం అన్యాయమని విమర్శించారు. కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే రోజు రోజుకు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయని, ధరలు అదుపు చేయాల్సిన ఈ రెండు ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేయకపోవడం విచారకరమని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ విధానాలను మార్చుకొని కార్పొరేట్లకు సహాయపడే విధానాలను విడనాడాలని డిమాండ్ చేశారు. అనంతరం తహశీల్దార్ సిహెచ్ రాధాకృష్ణకు వినతిపత్రం అందజేశారు. ఈ ధర్నాలో సిపిఎం నాయకులు కొన్ని సాంబమూర్తి, వెంకటేష్, జనార్ధన, శివుని నాయుడు, ప్రసాదు, రాము, లక్ష్మణ, సంగమ్మ వివిధ గ్రామాలకు చెందిన గిరిజనులు, ప్రజలు పాల్గొన్నారు. కురుపాం : సమరభేరి కార్యక్రమంలో భాగంగా స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద సిపిఎం మండల కార్యదర్శి ఎం. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ధర్నానుద్దేశించి జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు మాట్లాడారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలయ్యాయని ట్రూ ఆఫ్ చార్జీలు పేరుతో నెలలా విద్యుత్ బిల్లులు పెంచుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలపై మోపుతున్న భారాలను రాష్ట్రంలో ఉన్న మూడు పార్టీలు వ్యతిరేకించడం లేదని, కావున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పడానికి ప్రజలంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అనంతరం డిప్యూటీ తహశీల్దార్ ఎ.సాంబమూర్తికి వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు ఎన్ .సింహాచలం, వి .వాసు, అంగద, బి. వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. సీతానగరం : సమరభేరి కార్యక్రమంలో భాగంగా స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం తహశీల్దార్‌కు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు రెడ్డి లక్ష్మునాయుడు, మండల కార్యదర్శి రెడ్డి ఈశ్వరరావు, గవర వెంకటరమణ వినతిని అందజేశారు. కార్యక్రమంలో ఆర్.రాము, బి.అప్పారావు, ఆర్.రమణమూర్తి, వై.రామారావు, వై.ఈశ్వర రావు తదితరులు పాల్గొన్నారు. భామిని : ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యాన ధర్నా జరిగింది. ధర్నానుద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.తిరుపతిరావు మాట్లాడారు. అనంతరం తహశీల్దార్‌కు, ఎంపిడిఒకు వినతిని అందజేశారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ జగన్నయకులు, జె.జగన్నాధం, కె.మిన్నరావు, కె.ప్రసాద్, జె.ప్రసాద్, కె.భాస్కర్‌రావు, నాయకులు పాల్గొన్నారు. గరుగుబిల్లి: సమరభేరి కార్యక్రమంలో భాగంగా స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సిపిఎం మండల కార్యదర్శి బివి రమణ ఆధ్వర్యాన జరిగిన ధర్నాలో సిపిఎం మండల నాయకులు దాసరి వెంకట నాయుడు, కరణం రవీంద్ర, కలిశెట్టి జగ్గారావు, ఆదినారాయణ, బాబురావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సాలూరు: సమరభేరి కార్యక్రమంలో భాగంగా స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎన్నై నాయుడు ఆధ్వర్యాన పట్టణ పార్టీ నాయకులు కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. అనంతరం ఇంఛార్జి కమిషనర్ సూరి నాయుడుకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సిపిఎం పట్టణ నాయకులు టి.రాముడు,టి.శంకరరావు పాల్గొన్నారు. గుమ్మలక్ష్మీపురం : సమరభేరి కార్యక్రమంలో భాగంగా స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సిపిఎం మండల కార్యదర్శి కోలక అవినాష్ ఆధ్వర్యాన తొలుత గుమ్మలక్ష్మీపురం నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మండంగి రమణ, నాయకులు పువ్వల తిరుపతిరావు, బిడ్డిక శంకర్ రావు, బిడ్డిక సత్యం, ఎం సన్యాసిరావు, పి మోహన్ రావు, పాండురంగారావు, నాయకులు మహిళలు, నిరుద్యోగ యువత పాల్గొన్నారు. పార్వతీపురంరూరల్ : సమరభేరి కార్యక్రమంలో భాగంగా స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కు వినతిపత్రాన్ని అందించారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వి.ఇందిరా, పట్టణ కార్యదర్శి గొర్లి.వెంకటరమణ, నాయకులు రెడ్డి శ్రీదేవి, బంటు దాసు, కె.రామస్వామి, పాకల సన్యాశిరావు, బంకురు సూరిబాబు, పి.రాజశేఖర్, రాము, గౌరమ్మ, డి.పండు, కె.రాజు, జి. తులసి, స్థానికులు పాల్గొన్నారు. బలిజిపేట : సమరభేరి కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రజా సంఘాల కార్యాలయం నుండి తహశీల్దార్ కార్యాలయం వరకు సిపిఎం ర్యాలీ నిర్వహించి అనంతరం ధర్నా నిర్వహించారు. ధర్నానుద్దేశించి సిపిఎం నాయకులు వై.మన్మధరావు, గేదెల సత్యనారాయణ మాట్లాడారు. కార్యక్రమంలో వంజరాపు సత్యంనాయుడు, బొద్దాన భానుమూర్తి, నల్ల ఈశ్వరరావు, పిసా వెంకటస్వామి, వెన్నెల వేణుగోపాలు, గంట్యాడ బలరామ నాయుడు, ఆవు సాంబమూర్తి, బంకూరి గౌరినాయుడు, దన్నాన త్రినాధ, తదితరులు పాల్గొన్నారు. గుమ్మలక్ష్మీపురం: సమరభేరి కార్యక్రమంలో భాగంగా జియమ్మవలస తహశీల్దార్ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. మండల కార్యదర్శి కె. సీతారాం ఆధ్వర్యాన జరిగిన ధర్నాలో పెద్దసంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు. అనంతరం రెవెన్యూ అధికారులకు వినతి పత్రం అందించారు. సాలూరు రూరల్ : సమరభేరి కార్యక్రమంలో భాగంగా సమస్యలు పరిష్కరించాలని సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద నిరసన ధర్నా జరిగింది. ధర్నానుద్దేశించి సిపిఎం మండల కార్యదర్శి మర్రి శ్రీనివాసరావు, పట్టణ కార్యదర్శి ఎన్‌వై నాయుడు మాట్లాడారు. కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యులు గేమ్మేల జానకి రావు, కోనేటి చినబాబు, తాడంగి గాసి, గెమ్మెల బోడమ్మ, సూకురు గంగయ్య, సిద్ధ సాయిబాబా, గెమ్మెల సూరయ్య, పట్టణ కమిటీ సభ్యులు శంకర్రావు, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. సీతంపేట: సిపిఎం ఆధ్వర్యంలో స్తానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా జరిగింది. మండల కార్యదర్శి ఎ.భాస్కరరావు తహశీల్దార్‌కు సమస్యలపై వినతిని అందజేశారు. కార్యక్రమంలో జె.శ్రీరాములు బి. సాయి కె.దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. పాచిపెంట : సమరభేరి కార్యక్రమంలో భాగంగా సిపిఎం మండల నాయకులు సూక్రు అప్పలస్వామి, దీసరి వసంతరావు, జర్నీ రామయ్య, మంచాల శ్రీనివాసరావు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోరాడ ఈశ్వరరావు ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా జరిగింది. అనంతరం తహశీల్దార్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్, ఆర్‌ఐకి వినతిపత్రం అందజేశారు. పాలకొండ రూరల్: సమరభేరి కార్యక్రమంలో భాగంగా స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కమిటీ కన్వీనర్ డి.రమణారావు తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కె.రాము, డి.దుర్గారావు, ఎ.లక్ష్మణరావు, ఎస్.మజ్జయ్య, ఎ.ఒరియా, వి.చెంప, ఎస్.భానుసుందర్, ఎం.వీరంనాయుడు, బి.శివ, సిహెచ్.సంజీవి, పి.వేణు, రామరాజు, ఆదియ్య, ముఖలింగం పాల్గొన్నారు.










