- సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు
- కేంద్ర బడ్జెట్‌ను నిరసిస్తూ ఎన్‌టిఆర్ జిల్లావ్యాప్తంగా ధర్నాలు
ప్రజాశక్తి-వన్‌టౌన్: ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో ఎపి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ ఎన్‌టిఆర్ జిల్లావ్యాప్తంగా సిపిఎం ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. విజయవాడ వన్‌టౌన్ హెడ్ పోస్టాఫీస్ వద్ద జరిగిన ధర్నాలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అవలంభిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సబ్సిడీల్లో కోతలు, ఉపాధి కల్పించని కేటాయింపులు, సంక్షేమం కుదించే చర్యలు, ప్రభుత్వ రంగంలో వాటాల అమ్మకాలు సరికాదన్నారు. పాలు, పెరుగుపైనా జీఎస్టీ విధించి పేదలను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో జగన్ ప్రజల నడ్డి విరుస్తున్నారని తెలిపారు. ఆఖరికి చెత్త మీద కూడా రూ.150 పన్ను విధించిన చెత్త ప్రభుత్వం వైసిపి ప్రభుత్వమన్నారు. ప్రజల మధ్య కుల, మతాల పేరుతో బిజెపి మత విద్వేషాలు రెచ్చగొడుతోందన్నారు. 2014లో వెంకటేశ్వర స్వామి సాక్షిగా అమరావతికి రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయిస్తానని చెప్పిన ప్రధాని మోడీ 2023 వరకు ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. విద్య, వైద్యానికి కేంద్ర బడ్జెట్లో కేటాయింపు లేకపోవడం బాధాకరమన్నారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ మోడీకి వ్యతిరేకంగా మాట్లాడడానికి సిఎం జగన్ భయపడుతున్నారన్నారు. పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోగలమని, దానికి ఎర్రజెండా అండగా ఉంటుందని అన్నారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు కె.శ్రీదేవి మాట్లాడుతూ పెట్రోట్, డీజిల్, వంట గ్యాస్, నిత్యావసర ధరలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయినందున సామాన్యుల జీవనం సాగించడం భారంగా మారిందన్నారు. సిపిఎం పశ్చిమ సిటీ కార్యదర్శి బోయి సత్యబాబు అధ్యక్షతన జరిగిన ధర్నాలో సిపిఎం సెంట్రల్ సిటీ కార్యదర్శి భూపతి రమణరావు, తూర్పు సిటీ నాయకులు పి.కష్ణ, ఎస్.సుబ్బారెడ్డి, సిఐటియు నాయకులు ఎ.వెంకటేశ్వరరావు. దుర్గారావు, ఈ.వి.నారాయణ, ఐద్వా నాయకులు గాదె ఆదిలక్ష్మి, స్వప్న, ఆశ వర్కర్స్ జిల్లా నాయకురాలు ఎ.కమల పాల్గొన్నారు. ప్రజాశక్తి -నందిగామ: నందిగామ గాంధీ సెంటర్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు చనుమోలు సైదులు, కటారపు గోపాల్, సయ్యద్ ఖాసిం మాట్లాడుతూ ప్రజలకు నష్టం కలిగించేలా, కార్పొరేట్లకు మేలు చేసేలా కేంద్ర బడ్జెట్ ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు వల్లూరి రవి శేఖర్, కర్రి వెంకటేశ్వరరావు, సయ్యద్ లాల్ సలాం, జి గోపి నాయక్, షేక్ హుస్సేన్, బచ్చలకూరి లాజరు, ఎర్రా శీను, బత్తుల వెంకటేశ్వర్లు, ఉప్పు శీను, హనుమంతరావు, చెరుకుమల్లి పిచ్చయ్య, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రజాశక్తి-మైలవరం: మైలవరం బోసుబొమ్మ సెంటర్లో జరిగిన ధర్నాలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పివి ఆంజనేయులు మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తోన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సాగనంపాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి రావు రమేష్‌బాబు, నాయకులు వెంకటరెడ్డి, రావుల సుబ్బారావు, సిహెచ్ సుధాకర్, కె దేవేంద్ర, సిహెచ్ రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజాశక్తి-వత్సవాయి: వత్సవాయి సెంటర్‌లో జరిగిన ధర్నాలో సిపిఎం సీనియర్ నాయకులు చిరుమామిళ్ల హనుమంతరావు మాట్లాడుతూ బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి తగిన ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి తమ్మినేని రమేష్, వి.రాము, గంగుల వెంకటేశ్వర్లు, పెంటి వెంకయ్య, కంచర్ల కొండయ్య, పెంటి కోటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.
ప్రజాశక్తి-ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్‌లో జరిగిన ధర్నాలో సిపిఎం ఎన్‌టిఆర్ జిల్లా కార్యదర్శి డి.వి.కృష్ణ మాట్లాడుతూ ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన హామీలను అమలు చేయాలని, పోలవరానికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్‌సిహెచ్ శ్రీనివాస్, ఎం.మహేష్, ఎన్.ప్రకాష్, బేబీ సరోజినీ పాల్గొన్నారు. ప్రజాశక్తి-తిరువూరు: తిరువూరు బోసుబొమ్మ సెంటర్ బస్టాప్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి మేకల నాగేంద్రప్రసాద్, పి.శ్రీనివాసరావు, సాంబారు వెంకటేశ్వర్లు, బి.వెంకటేశ్వరరావు, ఆకుల రవి, మరకాల రాము పాల్గొన్నారు. ప్రజాశక్తి-గంపలగూడెం: స్థానిక విగ్రహాల సెంటర్ వద్ద జరిగిన ధర్నాలో సిపిఎం మండల కార్యదర్శి గువ్వల సీతారామిరెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మీసాల గోపి, దివ్యల నాగేశ్వరరావు, జానపాటి వెంకటేశ్వరరావు, మల్లవరపు కుటుంబరావు, ఎన్ సత్యంబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రజాశక్తి-జగ్గయ్యపేట: పట్టణంలోని ఎన్టీఆర్ కూడలి వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కె.కమల మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల పట్టణ కార్యదర్శి నాగమణి, నాయకులు కోటా కృష్ణ, దంతాల వెంకటేశ్వర్లు, దంతాల రాజేశ్వరి, షేక్ గౌస్‌మియా, ఎస్.రామనాథం తదితరులు పాల్గొన్నారు. ప్రజాశక్తి-ఎ.కొండూరు: మండలంలోని చీమలపాడు గ్రామంలో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి జెట్టి వెంకటేశ్వరరావు, నాయకులు పానేం ఆనందరావు, ఆళ్ల అమ్మిరెడ్డి, పంబి వెంకటేశ్వరరావు, భూక్య బిచ్చ, ఎస్.సోములు, బి.మురళీకృష్ణ, బి.శ్రీను, యోహాను, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.










