ప్రజాశక్తి అద్దంకి : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు ప్రజలంతా ఐక్యం కావాలని సిపిఎం బాపట్ల జిల్లా కార్యదర్శి సిహెచ్.గంగయ్య తెలిపారు. బిజెపి ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన ప్రచార భేరి కార్యక్రమాన్ని స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గంగయ్య మాట్లాడుతూ గత 9 సంవత్సరాలుగా దేశంలో బిజెపి పాలన సాగుతుందన్నారు. దేశ ప్రకజలకు అనేక హామీలు ఇచ్చినట్లు తెలిపారు. ఒక్క హామీ కూడా అమలు కాలేదని తెలిపారు. ప్రజా సమస్యలను విస్మరించి దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. పేదలకు సామాన్య ప్రజలు కు అండగా ఉండాల్సిన ప్రభుత్వం వారిపై మోయ లేనంత భారాలను మోపుతున్నట్లు తెలిపారు. కార్మికులకు కనీస వేతనం ఇవ్వడం లేదన్నారు. పేదలకు విద్య,వైద్యం అందనంత స్థాయిలో ఉందన్నారు. అనంతరం ప్రజలకు కరపత్రాలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు తంగిరాల వెంకటేశ్వర్లు, సిఐటియు మండల అధ్యక్షుడు జి. వెంకటరావు, సిపిఐ నాయకులు తన్నీరు సింగరకొండ, కార్మిక సంఘం నాయకులు,మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ప్రచార భేరి పోస్టర్ ఆవిష్కరణ
రేపల్లె : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని సిపిఎం, సిపిఐ నాయకులు కోరారు. స్థానిక సిపిఎం కార్యాయలయంలో సిపిఎం, సిపిఐ నాయకుల ఉమ్మడి సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రేపల్లెలో ఈనెల 12న నిర్వహిస్తున్న ప్రచార భేరి కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఎం రేపల్లె పట్టణ కార్యదర్శి సిహెచ్. మణిలాల్, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు పి.నాగంజనీయేలు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తుందన్నారు. నిత్యవసరాల ధరలను రోజు రోజుకు పెంచుతున్నారు. బిజెపి కుట్రలను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత కమ్యూనిస్టులపై ఉందన్నారు. బిజెపి ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా పనిచేస్తుందన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలందరూ ఐక్యంగా ఉండి మోడీ ప్రభుత్వాని సాగనంపాలన్నారు. రాష్ట్రానికి మోడీ ప్రభుత్వం చేస్తున్న ద్రోహం చేస్తుందన్నారు. ప్రత్యేక హోదా, పోలవరానికి నిధులు, రాజధాని నిర్మాణం, రైల్వే జోన్, రాయలసీమ,ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని పార్లమెంట్ సాక్షిగా విభజన చట్టంలో హామీ ఇచ్చినట్లు తెలిపారు. వాటిలో ఒక్కటి కూడా అమలు చేయలేదని విమర్శించారు. అనేక త్యాగాలు ద్వారా సాదించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అదానీ, జిందాల్, కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడానికి కేంద్రం కుట్ర చేస్తున్నట్లు తెలిపారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మెతక వైఖరి ఆవలంబిస్తూ ప్రజలను మోసం చేస్తున్నట్లు విమర్శించారు. మోడీ ప్రభుత్వం మతతత్వ ధోరణులను రెచ్చగొడుతున్నట్లు తెలిపారు. ప్రజా సమస్యపై పై ప్రశ్నించ కుండా, ప్రజలు ఐక్యం కాకుండా చేయడానికి ఎక్కడికక్కడ మత కలహాలు, వివాదాలు సృష్టిస్తున్నట్లు తెలిపారు. మతాలు కులాలు, భాషా సంస్కతితో కూడిన భారతదేశాని కాపాడు కోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపై ఉందన్నారు. ఈ సమావేశంలో సిపిఐ రేపల్లె ఏరియా కార్యదర్శి జి.బాలాజీ, సిపిఎం, సిఐపి నాయకులు కె.ఆశ్వీరాధం, కెవి.లక్ష్మణరావు, బి.శ్రీనివాసరావు, పి.నాగమల్లేశ్వరరావు పాల్గొన్నారు.










