ప్రజా వ్యతిరేక పాలనపై పోరాటం : సిపిఎం
ప్రజాశక్తి - ఆత్మకూర్
కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలు పోరుకు సిద్ధం కావాలని సిపిఎం పట్టణ కార్యదర్శి ఏ. రణధీర్ కోరారు. గురువారం స్థానిక సుదర్శన వర్మ భవనంలో సిపిఎం పట్టణ కమిటీ సమావేశం పట్టణ నాయకులు ఎన్.స్వాములు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపి కార్పొరేట్, మతోన్మాద విధానాలను ప్రజలకు తెలియజేయాన్నారు. ఆర్థిక విధానాలు, అధిక ధరలు, నిరుద్యోగం, ప్రైవేటీకరణ, జీఎస్టీ భారాలు ఇవన్నీ ప్రజల మీద విలయతాండవం చేస్తున్నాయని చెప్పారు. ఈ విధానాల వల్ల సామాన్య మానవుడు బతికే పరిస్థితుల్లో కనబడడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజల్లోకి తీసుకుపోయి దేశాన్ని కాపాడుకోవాలని అన్నారు. ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని కోరారు. సమావేశంలో సిపిఎం పట్టణ నాయకులు ఏ.సురేంద్ర, డి రామ్ నాయక్, షేక్ ఇస్మాయిల్, సద్దాం హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.










