Oct 06,2023 21:23

ప్రజా వినతులకు తక్షణ పరిష్కారం

పెద్దతిప్పసముద్రం (బి.కొత్తకోట) : జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమంలో వచ్చిన ప్రజా వినతుల తక్షణ పరిష్కానికి చూపాలని కలెక్టర్‌ గిరీష అధికారులను ఆదేశించారు. శుక్రవారం పెద్దతిప్పసముద్రం ఎంపిడిఒ కార్యాలయ ఆవరణంలో జిల్లా కలెక్టర్‌ గిరీష అధ్యక్షతన మండల స్థాయి జగనన్నకు చెబుదాం-స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టరుతో పాటు జాయింట్‌ కలెక్టర్‌ పర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌, ఆర్‌డిఒ మురళి, ప్రజల నుంచి వచ్చిన అర్జీలు స్వీకరిం చారు. తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ముఖ్యఅతిథిగా హాజర య్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టా త్మకంగా జగనన్నకు చెబుదాం మండల స్థాయి స్పందన కార్యక్రమం నిర్వహి స్తోందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన అర్జీలన్ని నిర్లక్ష్యం చేయకుండా అక్కడికక్కడే పరిష్కరించి ప్రజలలో సంతప్తి స్థాయి పెంచాలని కలెక్టర్‌ అధికా రులకు సూచించారు. ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి సచివాలయ వ్యవస్థ ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందించడం జరుగు తోంద న్నారు. గ్రామాలలో ఉన్న చిన్నచిన్న సమస్యలన్నీ కూడా పరిష్కరించాలనే ఉద్దేశం తో మండల స్థాయి జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమాన్ని తీసుకు రావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం ఇక్కడికి రావడం జరిగిం దని ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని తమ సమస్యలు పరిష్కరిం చుకో వాలన్నారు. తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి నిరంతరం ప్రజా శ్రేయస్సుకు కషి చేయడం జరుగుతోందన్నారు. ప్రతి పథకం అర్హులకు అందాలన్నదే ప్రభుత్వం యొక్క ఉద్దేశ్యమని, అర్హులైన లబ్ధిదారులందరూ ప్రభుత్వ పథకాలు సద్విని యోగం చేసుకోవాలన్నారు. మండల స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు ఏ ఒక్కరూ లబ్ధి అందలేదనే విమర్శలు రాకూడదని అధికారులకు తెలిపారు. మండల స్థాయి జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారు లందరూ ఇక్కడికి రావడం జరిగిందని మీ సమస్యలన్ని అర్జీ రూపంలో తెలి యజేసి పరిష్కరించుకోవాలని ప్రజలను కోరారు. పెద్దతిప్పసముద్రం మండలం లోని రంగసముద్రం గ్రామానికి చెందిన ఎస్‌.నాగయ్య తనకు వద్ధాప్య పెన్షన్‌ వస్తు నిలిపి వేయడం జరిగిందని తిరిగి తనకు పెన్షన్‌ పునరుద్ధరించాలని కలెక్టర్‌కు అర్జీ సమర్పించారు. బూర్లపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీదేవి తనకు సదరం సర్టిఫికెట్‌ మంజూరు చేయించాలని, మడుమూరుకు చెందిన కే.లీలావతి తమ పొలానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని, తుమ్మరకుంటకు చెందిన మల్లేష్‌ తనకు వికలాంగుల పెన్షన్‌ మంజూరు చేయించాలని అర్జీలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజలు అర్జీలు సమర్పిం చారు. సమస్యలన్నీ వెంటనే పరిష్కరించాలని కలెక్టర్‌ సంబంధిత అధికారులకు ఎండార్స్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో ఎంపిపి మహమ్మద్‌, తహశీల్దార్‌ విద్యాసాగర్‌, ఎంపిడిఒ గిరిధర్‌రెడ్డి, జడ్‌టిసి శివయ్య, సర్పంచ్‌ శంకరప్ప, సర్పంచ్‌ నాగరత్న భాస్కర్‌ నాయుడు, విద్యుత్‌ శాఖ ఎఇ ఉత్తన్న, బి.కొత్తకోట శాఖ ఎఇ గిరిధర్‌, వైసిపి జిల్లా ప్రచార కార్యదర్శి అయూబ్‌ భాష, సోషల్‌ మీడియా మండల కన్వీనర్‌ పవన్‌, వైసిపి నాయకులు సద్దాం, వివిధ శాఖల జిల్లా అధికారులు, మండల అధికారులు, సచివాలయ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.