Sep 27,2023 23:22

'జగనన్నకు చెబుదాం'లో ఫిర్యాదులు స్వీకరిస్తున్న కలెక్టర్‌, సంయుక్త కలె క్టర్‌



గుంటూరు: ప్రజా వినతుల పరిష్కారమే లక్ష్యంగా, నిర్ణీత గడువు లోగా నాణ్యమైన ప్రభుత్వ సేవలందించేందుకే జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరి గిందని జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌ రెడ్డి అన్నారు. బుధవారం పెదకాకాని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో కలెక్టర్‌, సంయుక్త కలె క్టర్‌ జి. రాజకుమారితో కలసి ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. వివిధ సమస్యల పరిష్కారం కోరుతు పెద కాకాని మండల ప్రజలు 21 అర్జీలు అందజేశారు. ఫిర్యాదుల స్వీకరణ అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు ప్రజలు తమ ఫిర్యా దులను టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1902 కు కాల్‌ చేసిన పిదప సదరు ఫిర్యాదు జేకేసీ పోర్టల్‌ లో నమోదు అవుతుందని చెప్పారు. సంబంధిత అధికారులు ఆయా ఫిర్యాదులను పరి శీలించి సహేతుకంగా పరిష్కరిస్తారని అన్నారు. మరింత మెరుగైన ఫలితాలు సాధించవచ్చనే ఉద్దేశంతో మండల కేంద్రాల్లో ప్రతి బుధ, శుక్రవారాల్లో జగనన్నకు చెబుదాం కార్యక్రమం ద్వారా ఫిర్యాదులు స్వీకరించడం జరుగు తోందని అన్నారు. ఆర్థికపరమైన అంశాలతో ముడి ిపడిన ఫిర్యాదులను ప్రభుత్వానికి నివేదించి పరిష్కరిస్తామని వివరించారు. బుధవారం అందిన ఫిర్యాదులను నిర్ణీత గడువు లోగా సంతృప్తి స్థాయిలో పరిష్కరించాలని ఆదేశిం చారు. కార్యక్రమంలో డిఆర్‌డిఎ, డ్వామా, హౌసింగ్‌ ప్రాజెక్టు డైరెక్టర్లు హరిహర నాథ్‌, యుగంధర్‌ కుమార్‌, వేణుగోపాల్‌, డిడి సోషల్‌ వెల్ఫేర్‌ మధుసూదనరావు, డిఎంఅండ్‌హెచ్‌ఒ డాక్టర్‌ శ్రావణ బాబు, డిపిఒ కేశవరెడ్డి, పంచాయితీ రాజ్‌ ఎస్‌.ఇ సురేష్‌, ఆర్‌.డబ్ల్యు.ఎస్‌ ఎస్‌.ఇ బ్రహ్మయ్య, జిల్లా మత్స్య శాఖాధికారి పి. గాలి దేముడు, డిఇఒ శైలజ తదితరులు పాల్గొన్నారు.