ప్రజాశక్తి-అనకాపల్లి
ప్రజా వైద్యులు, ప్రముఖ స్త్రీ వైద్య నిపుణులు, కేజీహెచ్ గైనకాలజీ విభాగపు ప్రొఫెసర్ డాక్టర్ వైఎల్ నర్సింగరావు ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన నేపథ్యంలో స్థానిక సిఐటియు కార్యాలయంలో మంగళవారం సిఐటియు, రైతు ఉపాధ్యాయ, ప్రజా సంఘాలు ఘనంగా సత్కరించాయి. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రజా వైద్యులుగా పేద బడుగు బలహీన వర్గాలకు ఎంతో సేవ చేశారని కొనియాడారు. వైద్యులుగా, జన విజ్ఞాన వేదిక నాయకులుగా ప్రజల్లో దాగి ఉన్న మూఢవిశ్వాసాలు అరాచకాలకు వ్యతిరేకంగా కృషి చేస్తున్నారని తెలిపారు. కరోనా సమయంలో సిపిఎం, సిఐటియు నిర్వహించిన కోవిడ్ సెంటర్లలో ప్రాణాలకు తెగించి వైద్య సహాయాన్ని అందించారన్నారు. అనేక వైద్య శిబిరాలను ఉచితంగా వైదం అందించారని తెలిపారు. ఇటువంటి వైద్యులు సమాజానికి ఎంతో అవసర మన్నారు. అనకాపల్లికి కూడా ఆయన వైద్య సేవలు విస్తరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆర్ శంకర్ రావు, జి కోటేశ్వరరావు, కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.బాలకృష్ణ, యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొంది చిన్నబ్బాయి, సిఐటియు నాయకులు వి.వి శ్రీనివాసరావు, జిఎంపిఎస్ జిల్లా అధ్యక్షులు గంట శ్రీరామ్, కే ఈశ్వరరావు, ఏ.రాజు, ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.










