ప్రజా ఉద్యమాలకు అండగా ఉండి పోరాడడమే తన అభిమతమని ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గ పిడిఎఫ్ అభ్యర్థి డాక్టర్ కోరెడ్ల రమాప్రభ హామీనిచ్చారు. విశాఖ, అనకాపల్లి జిల్లాలో పలు సంఘాల నేతలు ప్రచారం చేపట్టారు.
ప్రజాశక్తి - యంత్రాంగం
అరిలోవ : ప్రజాఉద్యమాలకు అండగా ఉండి పోరాడడమే తన అభిమతమని ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గ పిడిఎఫ్ అభ్యర్థి డాక్టర్ కోరెడ్ల రమాప్రభ హామీనిచ్చారు. శుక్రవారం ఉదయం ఆరు గంటలకే ఆరిలోవ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ వద్ద ప్రజాసంఘాల నాయకులతో కలిసి ముడసర్లోవ వాకర్స్ క్లబ్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులను కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఉత్తరాంధ్ర సమస్యలపై తనకు సమగ్రమైన అవగాహన ఉందని, తాను గెలిస్తే వాటిపై మండలిలో ప్రస్తావించి, పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.నీతి, నిజాయితీలకు కట్టుబడి, ప్రజాసమస్యలపై చిత్తశుద్ధితో పోరాడడం, ప్రజలకు అండగానిలవడం పిడిఎఫ స్వభావమని, దానికి శతశాతం కట్టుబడి తాను పనిచేస్తానన్నారు. కార్యక్రమంలో సిపిఎం నేతలు ఆర్‌కెఎస్‌వి.కుమార్, శంకరరావు, నరేంద్ర కుమార్, కె.సత్యనారాయణ, వి.కృష్ణమూర్తి, రంగమ్మ, భూలోకరావు, ఆదినారాయణ, మోహనరావు, గణపతి పాల్గొన్నారు.
సిఐటియు నేతల విస్తృత ప్రచారం
తగరపువలస : ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ పిడిఎఫ్ అభ్యర్థి డాక్టర్ కోరెడ్ల రమాప్రభ విజయాన్ని కాంక్షిస్తూ శుక్రవారం తగరపువలసలోని పలు ప్రాంతాల్లో సిఐటియు నేతలు రవ్వ నరసింగరావు, ఎస్ శ్రీనివాసవర్మ, సోమి వెంకట్, ప్రజాశక్తి భీమిలి డివిజన్ కోఆర్డినేటర్ ఆర్ వెంకటరమణ కరపత్రాలను పంచుతూ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
98వ వార్డులో విస్తృత ప్రచారం
సింహాచలం: ఈనెల 13న జరగనున్న ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పిడిఎఫ్ అభ్యర్థి డాక్టర్ రమాప్రభను గెలిపించాలని కోరుతూ 98వ వార్డులోని పలు ప్రాంతాల్లో సిపిఎం, సిఐటియు, ఇతర ప్రజాసంఘాలతోపాటు ప్రజారైతు సంక్షేమ సంఘం సభ్యులు విస్తృతం ప్రచారం నిర్వహించారు.
కొత్తకోట:ఉద్యోగ, ప్రజా కార్మిక సంఘాలు బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ కోరెడ్ల రమాప్రభకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని రావికమతం మండలంలో గిరిజన సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం విస్తత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా గిరిజన సంఘం మండల కార్యదర్శి పాడి బెన్నయ్య, డోల కళ్యాణ్ కుమార్, సింగరపు వలసయ్యలు అర్జాపురం, బెన్నవరం, కొట్నాబిల్లి గ్రామాలలో ప్రచారం చేశారు.
పిడిఎఫ్ అభ్యర్థి రమాప్రభకు మద్దతు
బహుజన ఐక్యవేదిక కన్వీనర్ బొట్టా నాగరాజు
ప్రజాశక్తి-నర్సీపట్నంటౌన్:పీడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిని కోరెడ్ల రమాప్రభకు తమ మద్దతు ఉంటుందని నర్సీపట్నం బహుజన ఐక్యవేదిక కన్వీనర్ బొట్టా నాగరాజు తెలిపారు.ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పక్షాన ప్రశ్నించే పిడిఎఫ్ అభ్యర్థులను పార్టీలకు అతీతంగా ఎన్నుకోవాలని ఈ సందర్బంగా ప్రజలకు పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో నెల్లూరి చిరంజీవి, కొల్లు గంగాధర్, సంజీవ్ పాల్గొన్నారు.
చోడవరం:ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి కోరెడ్ల రమాప్రభను గెలిపించాలని కోరుతూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం గోవాడ ఫ్యాక్టరీ, చోడవరం చందక వీధి, వెలమ వీధి ప్రాంతాలో ప్రచారం నిర్వహించారు. ప్రజా సంఘాల నాయకులు వివి శ్రీనివాసరావు, ఎస్వి నాయుడు, కోవెల శ్రీను, వై గణేష్, చందర్రావు పాల్గొన్నారు.
అచ్యుతాపురం : కోరెడ్ల రమాప్రభకు తొలి ప్రాధాన్యత ఓట్లు వేయాలని అచ్యుతాపురం మండల కేంద్రంలో శుక్రవారం సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి జి కోటేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ రాము, మండల కార్యదర్శి కే సోమినాయుడు ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఓటర్లను కలిశారు.
బుచ్చయ్యపేట : ప్రజా సంఘాల ఉమ్మడి అభ్యర్థి కోరెడ్ల రమాప్రభకు మద్దతు ఇవ్వాలని కోరుతూ సిఐటియు మండల కార్యదర్శి పి. సాంబశివరావు ప్రచారం నిర్వహించారు. శుక్రవారం మండలంలోని రాజాం, నీలకంఠాపురం, తైపురం, చిట్టి పాలెం, తురకలపూడి, సీతయ్యపేట ప్రచారం చేశారు.
మునగపాక రూరల్ : కోరెడ్ల రమాప్రభను గెలిపించాలని కోరుతూ మునగపాకలో గురువారం రాత్రి సిఐటియు నాయకులు ఎస్ బ్రహ్మాజీ, ప్రజా సంఘాల నాయకులు ప్రచారం చేపట్టారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే రమాప్రభను 250 ప్రజా సంఘాలు బలపరుస్తున్నాయని తెలిపారు. కౌలు రైతు సంఘం నాయకులు టెక్కలి జగ్గారావు, పెంటకోట సత్యనారాయణ, నాయీబ్రాహ్మణ సంఘం నాయకులు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.










