Jul 22,2023 23:37

మాట్లాడుతున్న సువర్ణరాజు

- శాశ్వత లోక్‌ అదాలత్‌ జడ్జి సువర్ణరాజు
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ : 
ప్రజాప్రయోజన సేవల్లో ఎటువంటి అవాంతరాలు జరిగినా శాశ్వత లోక్‌అదాలత్‌కు సత్వరమే సంప్రదించాలని శాశ్వత లోక్‌అదాలత్‌ జిల్లా న్యాయమూర్తి జ్ఞాన సువర్ణరాజు అన్నారు. జిల్లా లోక్‌ అదాలత్‌ సమావేశ మందిరంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. ప్రజాప్రయోజన సేవల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే శాశ్వత లోక్‌అదాలత్‌కు సంప్రదించి ఫిర్యాదు చేయాలని విజ్జప్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖలు అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జిల్లా అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్య, వైద్య రంగాల సేవల్లో లోపాలు ఉంటే సకాలంలో ఫిర్యాదు చేయాలని కోరారు. న్యాయ సేవాధికార సంస్థల చట్టం-1987 మేరకు 2006లో శాశ్వత లోక్‌అదాలత్‌లు ఆవిర్భవించాయని, వీటి ప్రధాన ఉద్దేశం సమగ్రమైన, సత్వరమైన, శీఘ్రమైన తీర్పులు ఇవ్వడం శాశ్వత లోక్‌అదాలత్‌ల లక్ష్యమని అన్నారు. సమావేశంలో గృహ నిర్మాణశాఖ పీడీ నక్క గణపతిరావు, డ్వామా పీడీ బి.చిట్టిరాజు, మెప్మా పీడీ ఎం.కిరణ్‌ కుమార్‌, ఆర్‌టిసి, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.