ప్రజాశక్తి - చిప్పగిరి
ప్రజా శ్రేయస్సును కోసం రాష్ట్ర ప్రభుత్వం 'జగనన్న ఆరోగ్య సురక్ష'ను అమలు చేస్తోందని తహశీల్దార్ లక్ష్మీనారాయణ, ఎంపిడిఒ కొండయ్య, వైద్యాధికారి జమీల్ అహ్మద్, సర్పంచి మల్లమ్మ తెలిపారు. మంగళవారం నగరడోన గ్రామంలోని ఓ ప్రయివేట్ హాలులో 'జగనన్న ఆరోగ్య సురక్ష'ను తహశీల్దార్ లక్ష్మీనారాయణ, మండల వైద్యాధికారి జమీల్ అహ్మద్, పంచాయతీ కార్యదర్శి నారాయణ స్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రజలు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ వైద్య శిబిరంలో ప్రజలకు అవసరమైన ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. రక్తంలో హిమోగ్లోబిన్ శాతం, బీపీ, షుగర్, మలేరియా, డెంగీ, మూత్ర పరీక్షలు, హెచ్‌ఐవి, హెచ్‌బిఎస్ వంటి పరీక్షలు నిర్వహించారు. జిల్లా నుంచి వచ్చిన గైనకాలజిస్ట్ డాక్టర్ సమత, డాక్టర్ బాల సిద్ధార్థ, పిఎంఒఎ ఆంజనేయులు, ఆలూరు నుంచి డాక్టర్ శేఖర్, వైద్యాధికారి జమీల్ అహ్మద్‌లు శిబిరానికి హాజరైన రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం రోగులకు అవసరమైన మందులను ఉచితంగా అందజేశారు. ఎంపిటిసి సరోజమ్మ, వైసిపి నాయకులు నాగేంద్ర, విఆర్‌ఒ కిష్టప్ప, సిహెచ్‌ఒ వెంకటేశ్వర్లు, ఫార్మాసిస్ట్ కృష్ణ పాల్గొన్నారు.
'జగనన్న ఆరోగ్య సురక్ష'ను పరిశీలిస్తున్న తహశీల్దార్ లక్ష్మీనారాయణ, అధికారులు










