Jun 24,2023 20:30

లబ్ధి పత్రాలను అందజేస్తున్న జగన్మోహన్‌ రెడ్డి

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
రాష్ట్రంలో ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా పాలన కొనసాగుతోందని వైసిపి నియోజకవర్గ సీనియర్‌ నాయకులు ఎర్రకోట జగన్మోహన్‌ రెడ్డి తెలిపారు. శనివారం పట్టణంలోని 24వ వార్డు సచివాలయం పరిధిలో మూడో రోజు 'గడపగడపకు మన ప్రభుత్వం' నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న పథకాలను, వాటి ద్వారా పొందిన లబ్ధిని వివరించారు. వార్డు పరిధిలోని కొన్ని వీధుల్లో తాగునీటి సమస్యను పరిష్కరించాలని, సిసి రోడ్లు, తదితర సౌకర్యాలు కల్పించాలని ప్రజలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్‌ అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజల అభ్యున్నతి, వారి శ్రేయస్సే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి పాలన కొనసాగిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం అన్ని వార్డుల్లోనూ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి సహకారంతో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని చెప్పారు. పట్టణంలోని అన్ని వార్డులను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఒక ప్రణాళిక ప్రకారం సిసి రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణాలను చేపడుతున్నామని తెలిపారు.