Nov 17,2023 23:30

పలాస : ప్రచారంలో పాల్గొన్న గౌతు శిరీష

ప్రజాశక్తి- పలాస :  పలాస నియోజకవర్గంలో పంటలు పూర్తిగా ఎండిపోయాయని, సకాలంలో సాగునీరు అందక, పంట కోసం పెట్టిన పెట్టుబడులు వస్తాయో లేదో తెలియని పరిస్థితుల్లో రైతులు ఉన్నారని, రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి పలాస నియోజకవర్గాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని రాష్ట్ర టిడిపి ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష డిమాండ్‌ చేశారు. మందస మండలం పిడిమందస పంచాయితీ మధ్య, నర్సింగపురం పంచాయతీ దేవుపురం, నర్సింగపురం, టంగరపుట్టి గ్రామాల్లో నిర్వహించిన బాబు ష్యూరిటీ-భవిష్యత్‌ గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ ఈ ఏడాది ఖరీఫ్‌ కాలంలో వర్షాలు లేక, రైతులు పెట్టిన పెట్టుబడులు రాక రైతులు దిగులుతో ఉన్నారని, అయినా వైసిపి ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. తక్షణమే పంట నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఇంటింటికి వెళ్లి చంద్రబాబు ప్రవేశ పెట్టిన మినీ మేనిఫెస్టో పంపిణీ చేశారు. కార్యక్రమంలో భావన దుర్యోదన, తమిరి భాస్కరరావు, రట్టి లింగరాజు, లబ్బ రుద్రయ్య, ఎం.నవీన్‌ కుమార్‌, అగ్గున్న జయరాజు, గేదెల రామకృష్ణ, డొక్క లక్ష్మీనారాయణ, నీర గిరిధర్‌, భాస్కర్‌ గౌడ, సవర లఖియా, శంకర్‌ పాల్గొన్నారు.
కోటబొమ్మాళి: రాష్ట్రానికి స్వర్ణయుగం రావాలంటే తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబునాయుడుతోనే సాధ్యమవుతుందని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటువేయాలని మండల టిడిపి అధ్యక్షుడు బోయిన రమేష్‌ అన్నారు. మేజరు పంచాయతీ పరిధిలో ప్రకాష్‌నగర్‌ కాలనీ, విద్యుత్‌నగర్‌లో బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి టిడిపి అధికారంలోకి వస్తే చేపట్టబోయే పథకాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు మజ్జి కృష్ణారావు, మూగి అచ్చయ్యరెడ్డి, కోరాడ గోవిందరావు పాల్గొన్నారు.
ఆమదాలవలస: టిడిపితోనే అభివృద్ధి సాధ్యమని టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు నూక అప్పల సూరన్నాయుడు (రాజు) అన్నారు. మండలంలోని దూసి ఆర్‌ఎస్‌లో బాబు ష్యూరిటీ భవిష్యత్‌ గ్యారంటీ కార్యక్రమంలో టిడిపి, జనసేన శ్రేణులతో కలిసి పాల్గొన్నారు. కార్యక్రమంలో తమ్మినేని చంద్రశేఖర్‌, తమ్మినేని అప్పలనాయుడు, కంచరాన లోకేశ్వరరావు, కోటినాయుడు, బాబురావు, జనసేన నాయకులు మురపాక రాజశేఖర్‌, గౌతమ్‌, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సరుబుజ్జిలి: రానున్న ఎన్నికల్లో వైసిపి ఇంటికే పరిమితం కానుందని టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు ఆంబళ్ల రాంబాబు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని నందికొండ కాలనీలో బాబు ష్యూరిటీ భవిష్యత్‌కు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి రానున్న ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి వస్తే ఒక్కో కుటుంబానికి ఎంత లబ్ధి చేకూరుతుందో ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో యూనిట్‌ ఇన్‌ఛార్జి నందివాడ గోవిందరావు, లావేటి పూర్ణారావు, గుర్రాల చిన్నబాబు, దవళ సింహాచలం, కొర్ను సూర్యనారాయణ, ఎండ రామారావు, కొమనాపల్లి రవి, దవళ సురేష్‌ పాల్గొన్నారు.
పోలాకి: బాబు ష్యూరిటీ - భవిష్యత్‌కు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా గుప్పాడపేట గ్రామంలో మాజీ శాసన సభ్యులు బగ్గు రమణమూర్తి పాల్గొన్నారు. గ్రామంలో పలు వీధుల్లో పర్యటించి చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ ప్రవేశపెట్టిన సూపర్‌సిక్స్‌ పథకాలు వివరించి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని రాష్టంలో వైసిపి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, దోపిడీలను వివరించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మిరియాపల్లి వెంకటప్పల నాయుడు, జనసేన నాయకులు బలగ ప్రవీణ్‌ కుమార్‌, మండల అధ్యక్షులు దండాసి, సీనియర్‌ నాయకులు బైరి భాస్కరరావు, యూనిట్‌ ఇన్‌ఛార్జి కారుకోల దృశ్యంత్‌, నాయకులు రోనాంకి కృష్ణంనాయుడు పాల్గొన్నారు.