Oct 16,2023 20:55

సచివాలయాన్ని ప్రారంభిస్తున్న ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్‌

చిన్నమండెం(రాయచోటి) : ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, కలెక్టర్‌ గిరీష, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం చిన్నమండెం మండలంలోని బోరెడ్డిగారిపల్లెలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, డాక్టర్‌ వైయస్‌ఆర్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌, వైయస్సార్‌ డిజిటల్‌ లైబ్రరీని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ అభివద్ధి కార్యక్రమాలు అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివద్ధి పథంలో పరుగులు పుట్టిస్తున్నారన్నారు. నేడు ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉన్నారని, ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి సహకరించాలన్నారు. కలెక్టర్‌ గిరీష మాట్లాడుతూ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం వివిధ అభివద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని అర్హులందరూ ప్రభుత్వ పథకాల సద్వినియోగం చేసుకొని మరింత అభివద్ధి చెందాలన్నారు. ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారని పేరొకన్నారు. గతంలో ఇంటి స్థలాలు, పెన్షన్లు, రేషన్‌ కార్డుల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే వారని పేర్కొన్నారు. నేడు సచివాలయంలో ఒక అర్జీ సమర్పిస్తే చాలు వెంటనే అర్హత మేరకు పేదలకు న్యాయం చేయడం జరుగుతోందన్నారు. నేడు రూ.95 లక్షలతో అన్ని సౌకర్యాలతో సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ హెల్త్‌ క్లినిక్‌, వైయస్సార్‌ డీజిల్‌ లైబ్రరీల భవన నిర్మాణాలు చేపట్టడం ప్రతి ఒక్కరు గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు. రాబోయే రోజులలో ఆంధ్రప్రదేశ్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపిపి సుధా మాధురి, సర్పంచ్‌ అమతమ్మ, ఎంపిటిసి తులసమ్మ, గ్రామస్తులు పాల్గొన్నారు.