
శిలాఫలకం ఆవిష్కరణలో ఎమ్మెల్యే, తదితరులు
ప్రజాశక్తి కదిరి అర్బన్ : ప్రజాసంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని స్థానిక ఎమ్మెల్యే సిద్ధారెడ్డి అన్నారు. పట్నం మెయిన్ రోడ్డు నుండి పట్నం గ్రామం వరకు రూ. 60 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన సిమెంట్ కాంక్రీట్ రోడ్డును ఎమ్మెల్యే బుధవారం ప్రారంభించారు. అంతకు ముందు ఎమ్మెల్యే డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం పైలాన్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అమర్నాథ్ రెడ్డి, జడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, సర్పంచులు, కో ఆప్షన్ సభ్యులు, ఎంపీటీసీలు, మండల కన్వీనర్లు, నాయకులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.