ప్రజాశక్తి రొద్దం : ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పెనుగొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ పేర్కొన్నారు. మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలో మంగళవారం నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఇంటింటికి తిరిగి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు పై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ తిమ్మయ్య, రెడ్డిపల్లి సర్పంచి రామాంజి, ఎంపీపీ చంద్రశేఖర్, రాష్ట్ర స్వచ్చంద్ర కార్పొరేషన్ డైరెక్టర్ బి.నారాయణరెడ్డి, మారుతి రెడ్డి, సానిపల్లి సర్పంచి పరమేష్ తదితరులతో పాటుఅధికారులు పాల్గొన్నారు.
తనకల్లు : మండలంలోని ఉస్తినపల్లి, బొమ్మలకుంట, మండ్లిపల్లి, దళితవాడ, తనకల్లులో మంగళవారం నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సిద్ధారెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన ఇంటింటికి తిరిగి వైసిపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు










