Jul 18,2023 00:08

ఎమ్మెల్యేకు సమస్యలు విన్నవిస్తున్న మహిళలు


ప్రజాశక్తి- యంత్రాంగం

నక్కపల్లి:ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పాలన సాగిస్తుందని ఎమ్మెల్యే గొల్ల బాబురావు తెలిపారు. సోమవారం నక్కపల్లి సచివాలయం వద్ద జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మండలంలోని ఇళ్ల స్థలాలు లేక ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారని, వారందరికి ఇళ్ల స్థలాలు ఇచ్చి పట్టాలు ఇవ్వాలని కాపు కార్పొరేషన్‌ డైరెక్టర్‌ వీసం రామకృష్ణ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ అర్హత గల ప్రతి ఒకరికి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి తహశీల్దార్‌, గృహ నిర్మాణ శాఖ అధికారులు చర్యలు తీసు కోవాలని ఆదేశించారు. దోసలపాడులో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ అంబేద్కర్‌, ఎంపీడీవో సీతారామరాజు, ఈఓపిఆర్డీ వెంకట నారాయణ, ఎంపీపీ రత్నం, జడ్పీటీసీ గోసల కాసులమ్మ, సర్పంచ్‌ జయ రత్నకుమారి, వైస్‌ ఎంపీపీలు నానజీ, ఈశ్వరరావు, నాయకులు పొడగట్ల పాపారావు, మణిరాజు పాన్నారు.
కోటవురట్ల: ్న జగనన్న సురక్ష కార్యక్రమంలో ఎమ్మెల్యే గొల్ల బాబురావు సోమవారం సుంకపూరు గ్రామంలో పాల్గొన్నారు. సుంకపూరు సచివాలయ పరిధిలో ధృవత్రాలను అందజేయగా గ్రామంలో కొంతమంది మహిళలు ఎమ్మెల్యేకు కాలనీ నిర్మాణ లబ్ధిదారులు పలు సమస్యలు విన్నవించారు. ప్రస్తుతం నిర్మిస్తున్న కాలనీ వద్ద రోడ్డు లేదని తీవ్ర అవస్థలు పడుతున్నామని లబ్ధిదారులు మఠం నాగమణి, దమ్ము రాజులమ్మ విన్నవించారు. ఎన్టీఆర్‌ కాలనీ బిల్లులు చెల్లించలేదని స్పష్టం చేశారు. బోడపాలెం గ్రామంలో జగనన్న సురక్ష కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ డివి సూర్యనారాయణ రాజు పాల్గొన్నారు. ఎంపీడీవో కాశీ విశ్వనాథరావు, తహసిల్దారు జానకమ్మ, వైస్‌ ఎంపీపీ దత్తుడు రాజు, సుంకపూరు సర్పంచ్‌ కాశీ లక్ష్మి, సర్పంచ్‌ ఎరుకు నాయుడు పాల్గొన్నారు.
గొలుగొండ:మండలంలోని కొత్తమల్లంపేట గ్రామంలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఎంపిపి గజ్జలపు మణికుమారి చేతుల మీదుగా 610 మందికి ధృవపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్‌ ఆనంద్‌, సర్పంచ్‌ పోలిరెడ్డి రాజబాబు, ఎంపిటిసి బొడ్డు సీత, నాయకులు బొడ్డు ఎర్రినాయుడు పాల్గొన్నారు. చీడిగుమ్మలలో 500 దృవపత్రాలను జెడ్పీటీసీ సుర్ల గిరిబాబు అందజేశారు. ఎంపిడిఒ డేవిడ్‌రాజు, ఎంపిటిసి అప్పలనాయుడు, సర్పంచ్‌ చిన్నబ్బాయి పాల్గొన్నారు.
నర్సీపట్నం టౌన్‌: వేములపూడి గ్రామంలో జగనన్న సురక్షలో భాగంగా సర్టిఫికెట్లు, రేషన్‌ కార్డులు పంపిణీ చేశారు. ఎంపీపీ సుర్ల రాజేశ్వరి మాట్లాడుతూ, అర్హత ఉండి సంక్షేమ పథకాలు పొందలేని వారి కోసం జగనన్న సురక్ష కార్యక్రమం ఏర్పాటు చేశారన్నారు. ఆర్డిఓ జయరాం, ఎంపీడీవో జయ మాధవి పాల్గొన్నారు.
అనకాపల్లి:జిల్లాలోని పలు గ్రామాల్లో జగనన్న సురక్ష కార్యక్రమాలు నిర్వహించారు. అనకాపల్లి మండలం గోపాలపురం గ్రామంలో ఎంపీపీ గొర్లె సూరిబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో మంత్రి అమర్నాథ్‌ ముఖ్య అతిథిగా పాల్గొని దరఖాస్తుదారులకు ధ్రువపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైసిపి రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్‌ కుమార్‌, సర్పంచ్‌ జెర్రిపోతుల లక్ష్మి పాల్గొన్నారు.
కశింకోట : మండలంలోని వెదురుపర్తి, త్యేగాడ గ్రామాల్లో జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి రోజారాణి, జెడ్‌పిటిసి దంతులూరి శ్రీధర్‌ రాజు, ఎంపిపి కలగా లక్ష్మి పాల్గొని ధ్రువపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపిపి పెంటకోట జ్యోతి, ఎమ్‌పిడిఓ రవికుమార్‌, సర్పంచ్‌లు కలగా గున్నయ్యనాయుడు, నీటిపల్లి ఈశ్వరమ్మ, నీటిపల్లి దివాకర్‌ పాల్గొన్నారు.
కె.కోటపాడు : మండలంలోని పిండ్రంగి, మేడిచర్ల గ్రామాల్లో జగనన్న సురక్ష కార్యక్రమాల్లో ఎంపీపీ రెడ్డి జగన్మోహన్‌ పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమాల్లో లంకవానిపాలెం సర్పంచ్‌ వేచలపు దొరబాబు, ఎంపీడీవో శశిదేవి, తహశీల్దారు రమేష్‌ బాబు, మండల ప్రత్యేకాధికారి నాగలక్ష్మి, పిండ్రంగి, మేడిచర్ల సర్పంచులు జాగరపు వెంకట మహాలక్ష్మి, పూడి నారాయణమూర్తి, ఎంపిటిసి రాజేష్‌ పాల్గొన్నారు.
దేవరాపల్లి : మండలంలోని రైవాడ, చింతలపూడి సచివాలయాల్లో సోమవారం జగనన్న సురక్ష గ్రామసభల్లో ఎంపీపీ కిలపర్తి రాజేశ్వరి భాస్కరరావు పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమాల్లో తహశీల్దార్‌ ఎం.లక్ష్మి, ఎంపీడీవో సిహెచ్‌.సుబ్బలక్ష్మి, మండల జెఎస్‌సి కన్వీనర్‌ కెవి.రమణ, ఈవోపిఆర్డి జిఎస్‌ నళిని, వైసిపి నాయకులు బూరె బాబురావు, వైస్‌ ఎంపీపీ ఉర్రోకుల గంగాభవాని, రైవాడ, చింతలపూడి, తామరబ్బ సర్పంచులు చల్లా లక్ష్మీ నాయుడు, దోమ్మంగి బోడెమ్మ, టోకూరు రామకృష్ణ పాల్గొన్నారు.
ఆరిలోవ : జివిఎంసి 12వ వార్డు పరిధి సంతపాలెం సామాజిక భవనంలో వార్డు కార్పొరేటర్‌ అక్కరమాని రోహిణి ఆధ్వర్యాన జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. జోనల్‌ కమిషనర్‌ కనకమహాలక్ష్మి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో విఎంఆర్‌డిఎ చైర్‌పర్సన్‌ అక్కరమాని విజయనిర్మల పాల్గొని 1703 మంది లబ్ధిదారులకు వివిధ రకాల ధ్రువపత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు సత్తి మందారెడ్డి, కన్నేటి సుబ్బారెడ్డి, పిఐ.బాలరాజు, సూర్యారావు, హుస్సేన్‌ పాల్గొన్నారు.
సీతమ్మధార : జివిఎంసి 48వ వార్డు పరిధి ఊర్వశి జంక్షన్‌లోని స్టీల్‌ సిటీ పబ్లిక్‌ స్కూల్‌ ఆవరణలో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఉత్తర నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త కెకె రాజు లబ్ధిదారులకు సంబంధిత సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో 48వ వార్డు వైసిపి ఇన్‌ఛార్జి నీలి రవి, ఎఇ అర్చన, జెసిఎస్‌ మండల కన్వీనర్‌ అమర్‌ రెడ్డి, నాయకులు కర్రి రామారెడ్డి, వసంతల అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
ఆనందపురం: మండలంలోని తర్లువాడ, పాలవలసలో ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యాన జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్‌ లోకవరపు రామారావు, ఎంపిడిఒ లవ రాజు, ఎంపిపి మజ్జి శారదాప్రియాంక, జడ్‌పిటిసి కోరాడ వెంకటరావు, తర్లువాడ సర్పంచ్‌ బిఆర్‌బి.నాయుడు, పాలవల సర్పంచ్‌ అచ్చియ్యమ్మ, తదితరులు పాల్గొన్నారు.