ప్రజాశక్తి-మాడుగుల: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు తెలిపారు. శనివారం జంపె లో గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకు ముందు మాడుగులలో సుమారు రూ.11 లక్షలతో నిర్మించిన అంగన్‌వాడీ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం వివిధ రకాలుగా సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను సైతం అమలు చేస్తుందన్నారు. ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి జగన్ అహర్నిశలు కష్ట పడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పెదబాబు, వైస్ ఎంపీపీలు తాలపురెడ్డి రాజారాం, కొత్తపల్లి శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు, పెద్ద సంఖ్యలో మండలంలోని వైసీపీ నేతలు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరికి పథకాలు : ధర్మశ్రీ
కొత్తకోట:అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పథకాలు అందేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ప్రభుత్వ విప్, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తెలిపారు. రావికమతం మండలం మేజర్ పంచాయతీ కొత్తకోట 1 వ సచివాలయ పరిధిలో శనివారం గడప గడప కూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన ఒకటోవ వార్డు నుంచి 4 వ వార్డు వరకూ ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పధకాల అమలుపై ఆరా తీశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, గ్రామంలో తాగునీటి అవసరాలకు సుమారు రూ. ఏడు కోట్ల నిధులు మంజూరు చేయించామని పేర్కొన్నారు. సుమారు 240 మందికి జగనన్న గృహ వసతి కల్పిస్తు న్నామని ఈ కార్యక్రమంలో ఎంపిపి పైల రాజు, ఎంపిడివో వెంకన్నబాబు, గ్రామ సర్పంచ్ కోన లోవరాజు, ఉపసర్పంచ్, పి.దేవ, డిసిఎంఎస్ డైరెక్టర్ జి. సత్యదేవ్, ఎంపిటిసి పూడి దేవ, కె.లక్ష్మి శంకర్, పైల చిన్నమ్మలు, వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తలారి ఆదిమూర్తి, కె.జగ్గారావు, కె.గున్నాజీ, పంచాయతీ కార్యదర్శి కె.కృష్ణ మోహన్ పాల్గొన్నారు.










