Nov 10,2023 21:34

ఆర్‌కె వ్యాలీ పోలీసుస్టేషన్‌ను ప్రారంభిస్తున్న జగన్‌, స్టేషన్‌లో సంతకం చేస్తున్న సిఎం

వేంపల్లె : ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ఆశయమని ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రెండు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం ఇడుపుల పాయ ఆర్కే వ్యాలీలో రూ1.75 కోట్లతో నిర్మించిన పోలీసు స్టేషన్‌, రూ.2.75కోట్లతో నిర్మించిన జమ్మలమడుగు పోలీసుస్టేషన్లను ప్రారభించారు. ఇడుపులపాయ నెమళ్ల పార్కు వద్దనున్న ప్రేయర్‌ హాలులో వేముల మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులతో కలిసి పులివెందుల నియోజకవర్గ అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పులివెందుల నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు కోసం అలుపెరగకుండా శ్రమిస్తున్న వేముల మండల ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులకు ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా సహకారం అందిస్తున్న ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని పేర్కొన్నారు. సమావేశంలో ముందుగా సొంత నియోజకవర్గ ప్రజలపై ఉన్న మమకారం, స్థానిక బంధువులు, స్నేహితులు, సన్నిహితులను ఒకేచోట కలిసిన ఆనందంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నియోజకవర్గ నాయకులను పేరుపేరునా ఆప్యాయంగా పలకరించారు. దివంగత నేత రాజశేఖర్‌రెడ్డి చనిపోయాక మీరంతా అందించిన ప్రోత్సాహం, సహకారం, మనోధైర్యంతో ఈ రోజు ముఖ్యమంత్రిగా మీ ముందు నిలిచి మీ అందరి మేలు కోసం పాటుపడుతున్నానని పేర్కొన్నారు. ఈ సందర్బంగా పాడా అభివృద్ధి పనుల పురోగతిపై ముఖ్యమంత్రికి కలెక్టర్‌ వి.విజరు రామరాజు క్లుప్తంగా వివరించారు. వేముల మండలం పరిధిలో పాడా, ఇతర శాఖల ద్వారా జరుగుతున్న మొత్తం అభివృద్ధి పనుల పురోగతిపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా పాడా ఒఎస్‌డి అనిల్‌ కుమార్‌రెడ్డి క్షుణ్ణంగా వివరించారు. అనంతరం పలువురు నాయకులు మండలంలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి అంశాలపై ముఖ్యమంత్రికి సలహాలు ఇచ్చారు. పలువురు నాయకులు పలు అంశాలపై వినతి పత్రాలను అంది వ్వడంతో పాటు, నేరుగా ముఖ్యమంత్రికి విన్నవించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ నాలుగున్నర సంవతసర కాలంలో వేముల మండల పరిధిలోని రోడ్లు, డ్రెయినేజీలు పనులు పూర్తి అయ్యాయని నల్ల చెరువు దగ్గర బ్రిడ్జి పనులు త్వరతిగతిన జరుగ ుతున్నాయని తెలిపారు. పెర్లపాడు దగ్గర వేర్‌ హౌస్‌, ఐటిఐ, జూనియర్‌ కాలేజ్‌లు నూతనంగా నిర్మించడంపై ఆనందం వ్యక్తం చేశారు. వేములలో తిరునాలగుట్ట బాగా అభివృద్ధి చెందిందని తెలిపారు. పెంచికల బసిరెడ్డి కాలువ (పివిసి)లో మొక్కలు పెరిగాయని, డిస్ట్రిబ్యూ టర్లకు క్లీన్‌ చేయించాలని, సిమెంట్‌ లైన్‌ నిర్మించాలని కోరారు. నల్లచె రువు గ్రామం పరిధిలో 1600 ఎకరాలు వున్నాయని అవి పైతట్టు ప్రాంతంలో వుండడం వలన నీరు అందడం లేదని పివిసి ద్వారా లిఫ్ట్‌ చేయించాలని కోరారు. మండ లంలో 76 సంపులులలో ఐదు పూర్తి అయ్యాయని మొత్తం అభివృ ద్ధి చేస్తే 15 వేల ఎకరాలను సాగు నీటిని అనుకూలంగా వుంటుందన్నారు. పెండ్లూరు చెరువుకు కుడి ఎడమ కాలువ లని ఏర్పాటు చేస్తే 1100 ఎకరాలకు అయుకట్టు కిందకి వస్తాయని కోరారు. గాలేరు నగరి కెనాల్‌ నుండి నారాపల్లి చెరువుకు నీటిని లిఫ్ట్‌ చేస్తే మరికొన్ని ఎకరాలు సాగు చేయొచ్చని తెలిపారు. వేముల సమీపంలో మినరల్స్‌ ఎక్కువగా వున్నాయని బైరటీస్‌,లైమ్‌ స్టోన్‌ వంటి ఖనిజాలను సంబందించి ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తే స్థానికంగా ఉపాధి లభిస్తోందని కోరారు. పత్తికి సీజనల్‌ క్రాప్‌ ఇన్సూరెన్స్‌ వర్తింప జేయాలని, రబీలో మినుములు, పెసర రైతులకు రాయితీలు కల్పించాలని కోరారు. కార్యక్రమం చివరలో ఈ నెల 14 నుండి 20వ తేదీ వరకు జరిగే 56వ గ్రంధాలయ వారోత్సవాల పోస్టర్‌ను సిఎం విడుదల చేశారు. కడప విమానాశ్రయంలో సిఎంకు నాయకులు వీడ్కోలు పలికారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి ఎస్‌.బి.అంజాద్‌బాషా, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఆదిమూలపు సురేష్‌, కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ధనుంజయరెడ్డి, ఒఎస్‌డి కృష్ణ మోహన్‌రెడ్డి, కలెక్టర్‌ వి.విజరు రామరాజు, జెసి గణేష్‌ కుమార్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ భరద్వాజ్‌, డిఐజి షేంతల్‌ కుమార్‌, ఎస్‌పి సిద్దార్థ్‌ కౌశల్‌, కడప నగర పాలక సంస్థ కమిషనర్‌ సూర్య సాయి ప్రవీణ్‌ చంద్‌, జడ్‌పి చైర్మన్‌ ఆకెపాటి అమర్నాథ్‌ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ ఇరగంరెడ్డి తిరుపేల్‌రెడ్డి, నగర మేయర్‌ కె.సురేష్‌ బాబు, ఎమ్మెల్సీ ఎం.రామచంద్రారెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే దాసరి సుధ, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కడప ఆర్‌డిఒ మధుసూదన్‌, పాడా ఒఎస్‌డి అనిల్‌ కుమార్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌ లింగాల ఉషా రాణి, పొల్యూషన్‌ బోర్డు చైర్మన్‌ ఎం.శివకృష్ణారెడ్డి పాల్గొన్నారు.