ప్రజాశక్తి-కోటనందూరు ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. బుధవారం వైసిపి మండల కన్వీనర్ చింతకాయల చినబాబు ఆధ్వర్యంలో అల్లిపూడి గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. చంద్రబాబు, యనమల రామకృష్ణుడు మాటలను ప్రజలు నమ్మవద్దని, జగన్ పరిపాలనలో రాజకీయ పార్టీలకు, సామాజిక వర్గాల కతీతంగా సంక్షేమ పథకాలను అందించిన ఘనత ముఖ్యమంత్రి జగన్ దేనన్నారు. రాష్ట్రంలో నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసి నాణ్యమైన గుణాత్మకమైన విద్యను అందిస్తున్నట్టు గుర్తు చేశారు. ప్రజా సమస్యలను వింటూ వాటి పరిష్కారానికి అధికారులకు ఆదేశాలిస్తూ ముందుకు సాగారు. గ్రామ సచివాలయ సిబ్బంది వాలంటీరు గహ సారథుల పనితీరుపై ప్రజలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం నూతనంగా మంజూరైన పెన్షన్లను మంత్రి రాజా బాధితులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి లగుడు శ్రీనివాస్, గొర్ల రామచంద్రరావు, గర్సింగు దొరబాబు, చింతకాయల చిట్టిబాబు, ఎంపిటిసి సభ్యులు నమ్మాది నాగమణి, లంక ప్రసాద్, సుర్ల రాజు, కుంచె అచ్చిరాజు, జిగటాల వీరబాబు, తరిపే నూకాలమ్మ పాల్గొన్నారు.










