Jul 26,2023 22:25

వజ్రపుకొత్తూరు : అధికారులను నిలదీస్తున్న జయరాం

ప్రజాశక్తి- పోలాకి: ప్రజా సంక్షేమమే జగనన్న సురక్ష కార్యక్రమం అమలు నిర్వహిస్తుందని ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. మండలంలోని గుప్పిడిపేటలో బుధవారం నిర్వహించిన జగనన్న సురక్షలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య బద్ధంగా పాలన అందించడమే లక్ష్యమని అన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం నెల రోజుల పాటు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలను లబ్ధిదారులకు ఎంటువంటి వ్యయప్రయాసలు లేకుండా అందజేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్‌ కరిమి రాజేశ్వరరావు, జెడ్‌పిటిసి ధర్మాన కృష్ణచైతన్య, ఎంపిపి ప్రతినిధి ముద్దాడ భైరాగినాయుడు, సర్పంచ్‌ ప్రతినిధి పైడి తాత, ఎంపిటిసి పైడమ్మ, తహశీల్దార్‌ కె.శ్రీరాములు, ఎంపిడిఒ ఉషశ్రీ పాల్గొన్నారు.
కోటబొమ్మాళి: మండలంలోని తర్లిపేట సచివాలయంలో సర్పంచ్‌ ఆధ్వర్యాన నిర్వహించిన జనగన్న సురక్షలో నియోజకవర్గ ఇన్‌ఛార్జి దువ్వాడ వాణి, ఎంపిపి రోణంకి ఉమామల్లేశ్వరరావులు పాల్గొని 11 రకాల ధ్రువపత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి మంద లోకనాథం, వైస్‌ ఎంపిపిలు బోయిన నాగేశ్వరరావు, దుక్క రోజా, పిఎసిఎస్‌ అధ్యక్షులు బాడాన మురళి, మండల విప్‌ బొడ్డు అప్పన్న, రైతుభరోసా జిల్లా అడ్వెయిజరీ కమిటీ సభ్యులు సభ్యులు కవిటి రామరాజు, ఎంపిటిసి నంబాళ్ల రాజశేఖర్‌, మండల కో-అప్సన్‌ సభ్యులు షేక్‌ రాజ్‌, బలగ సూర్యారావు పాల్గొన్నారు.
వజ్రపుకొత్తూరు : మండలంలోని పల్లిసారథిలో సర్పంచ్‌ పోతన్నపల్లి కుసుమ ఆధ్వర్యాన నిర్వహించిన జనగన్న సురక్షలో ఎంపిపి ప్రతినిధి ఉప్పరపల్లి ఉదరుకుమార్‌ పాల్గొని లబ్ధిదారులకు వివిధ రకాల ధ్రువపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో తహశీల్దార్‌ బి.అప్పలస్వామి, ఇఒపిఆర్‌డి డిక్కల తిరుమలరావు, మాజీ సర్పంచ్‌ పోతనపల్లి ధర్మారావు, సర్పంచ్‌ ప్రతినిధి పోతనపల్లి హేమంత్‌ పాల్గొన్నారు.
మెళియాపుట్టి : ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు జగనన్న సురక్ష కార్యక్రమం దోహదపడుతుందని తహశీల్దార్‌ పి.సరోజని, ఎంపిడిఒ పి.చంద్రకుమారి అన్నారు. మండలంలో మర్రిపాడు-కె సచివాలయం వద్ద తహశీల్దార్‌, జోడూరు సచివాలయం వద్ద ఎంపిడిఒ నిర్వహించి లబ్ధిదారులకు అవసరమైన ధ్రువపత్రాలను అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎంఇఒ ఎం.పద్మనాభవం, మండల ఎఒ దానకర్ణుడు, ఎపిఎం లలిత, సర్పంచ్‌లు పాల్గొన్నారు.
పెద్దబొడ్డపాడులో నిలదీత
వజ్రపుకొత్తూరు :
మండలంలోని పెద్దబొడ్డపాడులో నిర్వహించిన జగనన్న సురక్షలో గ్రామస్తులు నిలదీశారు. దీంతో గందరగోళంగా తయారైంది. సీతాపురానికి చెందిన తమ్మినేన జయరాం తనకు రేషన్‌ కార్డు, రైతు భరోసా రావడం లేదని నిలదీశారు. మీరు రైల్వే పెన్షనర్‌ కావడం వల్లే రేషన్‌ కార్డుతో పాటు రైతు భరోసా రావడం లేదని ఆయనకు అధికారులు సమాధానం ఇచ్చారు. దీనిపై జయరాం మాట్లాడుతూ నాతో పాటు పెన్షను తీసుకున్న వారికి రైతు భరోసా, రేషన్‌ కార్డు ఎలా అందించారని అధికారులను తిరిగిని ప్రశ్నించారు. రాజకీయంగా తనకు అనుకూలంగా ఉన్న పెన్షనర్లకు రేషన్‌ కార్డుతో పాటు రైతు భరోసా అందిస్తున్నారని సర్పంచ్‌ ఢిల్లీరావుపై విరుచుకుపడ్డారు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాదన పెరగడంతో కార్యదర్శి సనపల దామోదర్‌ వారించారు. ఈ విషయమై డిటి వాయిలపల్లి గిరిరాజ్‌ మాట్లాడుతూ రేషన్‌ కార్డులు ఇప్పుడు ఇవ్వలేదని, గతంలో జారీ చేసినవి అన్నారు. ఉద్యోగులకు ఆధార్‌ కార్డు లింక్‌ ఉంటుందని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆధార్‌ లింక్‌ లేకపోవడం వల్ల ఈ సమస్య ఉత్పన్నమైందని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ గ్రామంలో కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు ప్రభుత్వ పథకాలు అన్నీ అందుతుండగా, నా ఒక్కరికి మాత్రమే ఎందుకు ఎవ్వడం లేదని అధికారులను నిలదీశారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదిస్తానని డిటి తెలిపారు. కార్యక్రమంలో ఎంపిడిఒ సిహెచ్‌.ఈశ్వరమ్మ, కొండవూరు సర్పంచ్‌ కొల్లి భాస్కరరావు, ఎంపిటిసి మాజీ సభ్యులు ఇప్పిలి అప్పన్న, విఆర్‌ఒ రాణి పాల్గొన్నారు.