భూమిపూజ చేస్తున్న మంత్రి ఉషశ్రీచరణ్
ప్రజాశక్తి-కళ్యాణదుర్గం రాష్ట్రంలోని ప్ర జల సంక్షేమమే ముఖ్యమంత్రి జగనన్న లక్ష్యమని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీచరణ్ అన్నారు. శనివారం మండల పరిధిలోని ఈస్టు కోడిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించనున్న 33-11కేవీ విద్యుత్ ఉప కేంద్రానికి మంత్రి భూమిపూజ చేశారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ప్రతి ఇంటికీ ఏదో ఒక సంక్షేమ పథకం పేరుతో లబ్ధి చేకూరిందన్నారు. గతంలో టీడీపీ జన్మభూమి కమిటీలు సూచించిన వారికే సంక్షేమ ఫలాలు అందేవన్నారు. అయితే వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయాశాఖల అధికారులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.










