Apr 09,2023 21:40

జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాల్లో వైసిపి నాయకులు
ప్రజాశక్తి - కైకలూరు

ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న సిఎం జగన్‌కు ప్రజలు అండగా ఉండాలని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు తెలిపారు. ఆదివారం కైకలూరు మండలం ఆలపాడు, పెంచికలమర్రు, పందిరిపల్లిగూడెం, గుమ్మళ్లపాడు తదితర గ్రామసచివాలయాల పరిధిలో జగనన్నే మా భవిషత్తు కార్యక్రమం నిర్వహించారు. ఆయా సచివాలయాల కన్వీనర్లు, గృహసారధులతో కలిసి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించారు. మంచి చేస్తున్న జగనన్నకు మద్దతుగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌సి జయమంగళ వెంకటరమణ, ఎంపిపి అడవి కృష్ణమోహన్‌, వైసిపి మండల అధ్యక్షులు భట్రాజు శివాజీ, సర్పంచుల ఛాంబర్‌ మండల అధ్యక్షులు చెరుకువాడ బలరామరాజు, సచివాలయ కన్వీనర్లు, ఆయా గ్రామాల సర్పంచులు, వాలంటీర్లు పాల్గొన్నారు.
ద్వారకాతిరుమల : స్థానిక చెరువు వీధిలో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని గోపాలపురం ఎంఎల్‌ఎ తలారి వెంకట్రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత వైసిపికే చెందుతుందన్నారు. సిఎం జగన్‌ పేదలకు అండగా నిలిచారన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజల వద్దకే సంక్షమ పథకాలు తీసుకెళ్లి అందజేస్తున్నామన్నారు. ప్రతినెల ఒకటో తేదీన తెల్లవారుజామునే వృద్ధులకు, వితంతువులకు పింఛన్లు అందిస్తున్నారన్నారు. తమ ప్రభుత్వపాలన నచ్చితేనే వచ్చే ఎన్నికల్లో ఓటు వేయాలని ప్రలను కోరారు. ఈ కార్యక్రమంలో గృహ సారధులు, వైసిపి నాయకులు చెలికాని రాజబాబు, బొండాడ వెంకన్నబాబు, పెద్దిరెడ్డి నాగేశ్వరరావు, ఉక్కుర్తి వెంకటరావు, పెద్దిరెడ్డి జ్యోతి, సర్పంచి కుంటం స్వర్ణలత, చెన్నూరి రామకృష్ణ పాల్గొన్నారు.