
మాట్లాడుతున్న నాయకులు
ప్రజా సంక్షేమమే ధ్యేయం
ప్రజాశక్తి-వరికుంటపాడు:ప్రజా సంక్షేమమే సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్యేయంగా పెట్టుకున్నారని వైసిపి మండల కన్వీనర్ మందల తిరుపతినాయుడు, మాజీ ఎఎంసి చైర్మన్ ఆలీ అహ్మద్ తెలిపారు. గురువారం మండలంలోని కాంచెరువులో సచివాలయ కన్వీనర్ బొడ్డు వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన జగన్ రాష్ట్రానికి ఎందుకు కావాలి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి నాలుగున్నరేళ్లలో ప్రజల అభివద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి పెట్టుకున్నారని పేర్కొన్నారు. పార్టీలు కులాలు, మతాలు వర్గాలు చూడకుండా సంక్షేమ పథకాలు అందించిన ఒకే ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ అభివద్ధి కార్యక్రమాలను చూసి దేశంలోని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆంధ్ర రాష్ట్రం వైపు ముఖ్యమంత్రి వైపు చూస్తున్నారన్నారు. అనేక రాష్ట్రాల తమ ప్రతినిధులను ఆంధ్ర రాష్ట్రానికి పంపి అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాల వివరాలు సేకరించి ఆయా రాష్ట్రాలలో వాటిని అమలు పరుస్తున్నారన్నారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ గుంటుపల్లి రామాంజనేయులు, సర్పంచులు మందల మల్లేశ్వరి, బండారు రవణమ్మ నాగభూషణం. శేషం నాగభూషణం, పీర్నంపాటి పెద్ద మౌలాలి, కొందిపోగు దిలీప్, ఎర్రమల ప్రభాకర్ రెడ్డి, కుమ్మిత ప్రతాపరెడ్డి, మాగంటి శ్రీనివాసులు, జిలాని, చంచల మధు, నారాయణరాజు, తదితరులు పాల్గొన్నారు.