సత్తెనపల్లి టౌన్: రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు అందాలనే దడ సంకల్పంతోనే ముఖ్యమంత్రి జగన్ జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రారం భించారు అని రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు అన్నారు . శుక్రవారం ఆయన స్థానిక వెంకటేశ్వర గ్రాండ్ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ పరిధిలోని వాలంటీర్లు, సచివాలయం సిబ్బంది, కన్వీనర్లుతో ఏర్పాటు చేసిన సమావేశంలో నరస రావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణ దేవ రాయలతో కలసి ఆయన మాట్లాడారు. మంత్రి మాట్లా డుతూ అర్హులై వుండి ఏవో కొన్ని కారణాల రీత్యా సంక్షేమ పథకాలను పొందలేని వారికోసం ఈ కార్యక్రమాన్ని తీసుకువచ్చినట్లు చెప్పారు. 'జగనన్న సురక్ష'లో 11 రకాల సేవలను సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి వారి అవసరాలను గుర్తించి వారికి అవసరమైన ధ్రువపత్రాలను ఎటువంటి రుసుం చెల్లించకుండా ప్రజలకు అందివ్వడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించటం జరిగిందన్నారు. ఈ అవకాశాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఎన్. రాజ నారాయణ, ప్రముఖ న్యాయవాది పి.సూరిబాబు, డాక్టర్ నాగభూషణరెడ్డి, యార్డు చైర్మన్ పి.బాబురావు , సాంబశివ రావు , షేక్ నాగుల్ మీరాన్ పాల్గొన్నారు.










