Jul 19,2023 22:05

గిరిజనులంతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కళావతి

ప్రజాశక్తి - సీతంపేట : ప్రజా సంక్షేమం కోసమే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి అన్నారు. మండలంలోని కీసరజోడు సచివాలయ పరిధిలో కీసరజోడు, మర్రిమానుగుడ, కొంజరగూడ, కారిగూడ, లోతుగూడ, గొర్రిమడ, దిబ్బగూడ, నిడిమిగూడ, దిగువ కలువరాయి, ఎదురువలస, ఎదురువాడ, తాబేలువలస, బొక్కుడుగూడ గ్రామాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు ఏఏ స్థాయిలో , ఏఏ వర్గాలకు, చెందుతున్నాయో, ఏమాత్రం అందుతున్నాయి అన్న అంశంపై ఎమ్మెల్యే గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అలాగే ఇంకా ఎవరైనా అర్హులకు పథకాలు అందకపోతే తక్షణమే సంబంధిత సచివాలయాల్లో అధికారులను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో ఎపిపి బిడ్డిక ఆదినారాయణ, పాలకొండ ఎఎంసి చైర్మన్‌ హిమరక మోహనరావు, స్థానిక సర్పంచ్‌ సన్నాపురం రవి, ఎంపిటిసి సభ్యులు సవర మంగయ్య, నిమ్మక హరిప్రసాద్‌, ఎంపిడిఒ కె.సత్యం, కార్యదర్శి అప్పలసూరి, సచివాలయ సిబ్బంది, మండల ఉన్నత స్థాయి అధికారులు, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.