Nov 19,2023 23:24

ఆమదాలవలస : పూలమాలవేసి నివాళ్లర్పిస్తున్న సత్యవతి తదితరులు

ప్రజాశక్తి- ఆమదాలవలస: ప్రజా సంక్షేమం కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమని పిసిసి ఉపాధ్యక్షురాలు బొడ్డేపల్లి సత్యవతి అన్నారు. ఆదివారం ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా పట్టణంలో గేటులో ఉన్న ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశాన్ని ప్రపంచ దేశాలతో సమానంగా విప్లవాత్మక నిర్ణయాలతో ప్రజల మనసులో చిరస్థాయిగా ఇందిరగాంధీ నిలిచిపోయారని కొనియాడారు. మూడుతరాలు దాటినప్పటికీ నేటికీ ప్రజలు ఇందిరమ్మ ఇల్లు అని చెప్పుకుంటున్నారని అదే కాంగ్రెస్‌ ఘనతని అన్నారు. దేశం, రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని, ఇటువంటి తరుణంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సనపల అన్నాజీరావు, మాజీ ఎంపిపి బొడ్డేపల్లి గోవింద గోపాల్‌, ప్రధాన కార్యదర్శి లఖినేని నారాయణరావు, జిల్లా ఆర్గనైజేషన్‌ సెక్రటరీ బస్వా షణ్ముఖరావు, మాజీ కౌన్సిలర్‌ కూన సుందరరావు, లఖినేని సాయిరాం, సనపల వాసుదేవరావు, గురుగుబెల్లి కృష్ణారావు, దాలయ్య, శ్రీరాములు పాల్గొన్నారు.
రణస్థలం రూరల్‌: ఇందిరా గాంధీ ఆశయ సాధనకు కృషి చేయాలని ఎచ్చెర్ల నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌ఛార్జి కొత్తకోట్ల సింహాద్రి నాయుడు అన్నారు. భారతరత్న, మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ 106వ జయంతి సందర్బంగా ఆదివారం మండల కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఇందిరాగాంధీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి ఎంతో కృషి చేసారన్నారు. కార్యక్రమంలో పిసిసి డెలిగేట్‌ కె.లక్ష్మీ, కె.జోగినాయుడు, రమణ, గణేష్‌ పాల్గొన్నారు.
టెక్కలి: బారతదేశాన్ని తిరిగి అభివృద్దిలో నడిపే ఘనత ఒక్క కాంగ్రెస్‌ పార్టీకే సాధ్యమని డిసిసి అధ్యక్షులు డాక్టర్‌ పేడాడ పరమేశ్వరరావు ఆన్నారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఆదివారం స్దానిక ఇందిరాగాంధీ జంక్షన్‌ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇందిరాగాంధీ విగ్రహనికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. రాహుల్‌గాంధీ నాయక త్వంలో కాంగ్రెస్‌పార్టీ ప్రజలకోసం పనిచేస్తుందన్నారు. అనంతరం పేదలకు వస్త్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా కిసాన్‌ మోర్చా అధ్యక్షులు కోత మధుసూదనరావు, ఐటిసెల్‌ విభాగం అధ్యక్షులు భాస్కరబాబు, పొట్నూరు ఆనందరావు, శాసుమహంతి ధర్మారావు, విశ్రాంత ఉపా ధ్యాయులు చింతాడ పార్వతీశం, మాజీ సైనికుల సంఘం నాయకులు సత్తారు ఉగాది, లక్మీపతి, వెంకటరమణ పాల్గొన్నారు.