ప్రజాశక్తి - మంత్రాలయం
ప్రజా సంక్షేమం, అభివృద్ధి అజెండాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన కొనసాగిస్తున్నారని వైసిపి యువజన విభాగం రాష్ట్ర నాయకులు వై.ప్రదీప్ రెడ్డి తెలిపారు. శుక్రవారం మండలంలోని చిలకలడోణ గ్రామంలో 'గడపగడపకు మన ప్రభుత్వం' నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత జగనన్నదేనని తెలిపారు. అనంతరం ఆయన ఇంటింటికీ వెళ్లి సంక్షేమ పథకాల అమలు గురించి లబ్ధిదారులతో అడిగి తెలుసుకున్నారు. 'గడపగడపకు మన ప్రభుత్వం'లో భాగంగా ఆయన దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వైసిపి మండల అధ్యక్షులు జి.భీమిరెడ్డి, ఇన్‌ఛార్జీ విశ్వనాథ్ రెడ్డి, సొసైటీ ఛైర్మన్ వెంకట్ రెడ్డి, సిఇఒ వెంకటేష్, సర్పంచి నాగమ్మ, ఎంపిటిసి ఆకుల లక్ష్మి పాల్గొన్నారు.
ప్రజలకు వివరిస్తున్న ప్రదీప్ రెడ్డి










