Jan 19,2023 23:43

శిలాపలకాన్ని ఆవిష్కరిస్తున్న బూడి

ప్రజాశక్తి-చీడికాడ:ప్రజా సంక్షేమానికి వైసీపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు అన్నారు. మండలంలో ఖండివరం నుండి వీరభద్ర పేట వరకు నిర్మించిన తారు రోడ్డును ఉప ముఖ్యమంత్రి బూడి గురువారం ప్రారంభించారు. మండలంలో వీరభద్రపేట గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలను అడిగి తెలుసుకున్నారు. ముందుగా ఉప ముఖ్యమంత్రి అంబేద్కర్‌ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ ప్రభుత్వం చేయని పనులు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చేస్తుందన్నారు. ప్రతిపక్షాలన్నీ ఏకమైనా రాష్ట్రంలో మళ్లీ వైసిపి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కురచా జయమ్మ నారాయణమూర్తి, జడ్పిటిసి లాలం శారద వరలక్ష్మి జానకి రామ్‌, మండల వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్‌ ఎర్ర అప్పారావు, ఎంపీడీవో జయ ప్రకాష్‌ రావు, తహసిల్దార్‌ రాణి, వైసీపీ మండల కన్వీనర్‌ గొల్లవిల్లి రాజుబాబు, యూత్‌ కన్వీనర్‌ స్వామి నాయుడు, వైసిపి నాయకులు శీరం రెడ్డి సూర్యనారాయణ, సుంకర వెంకట్రావు, కొండబాబు, చైతన్య పాల్గొన్నారు.