ప్రజాశక్తి -రాంబిల్లి
సంక్రాంతి సందర్భంగా రాంబిల్లి పంచాయతీ యాతపేట గ్రామంలో ఐద్వా, సిఐటియు, డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో శనివారం ముగ్గులు పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 67 మంది మహిళలు సంక్రాంతి పండగ ఉట్టి పడేలా ముగ్గులు వేసి వేశారు. అనంతరం విజేతలకు, పోటీల్లో పాల్గొన్న వారందరికీ ఐద్వా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుపి మాణిక్యం, ఎస్.అరుణ, సిఐటియు నాయకులు జి.దేవుడు నాయుడు, సిహెచ్ గంగరాజు, డివైఎఫ్‌ఐ నాయకులు సిహెచ్ శివాజీ, ఎన్ నారాయణరావు, గ్రామ పెద్దలు చేతుల మీదగా బహుమతులు అందజేశారు. ధోని కాశీయా డివైఎఫ్‌ఐ నాయకుడు సహకారంతో ఈ బహుమతులు ఇచ్చారు. అనంతరం సేవ్ స్టీల్ ప్లాంట్, ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకుందాం, బిజెపి ప్రభుత్వ మొండి వైఖరి నశించాలని అని ముగ్గులు వెయ్యాలని ఆయా సంఘాల నాయకులు ప్రజలకు సూచించారు.
మహిళలకు ముగ్గుల పోటీలు
భీమునిపట్నం : భోగి పండుగ సందర్భంగా స్థానిక బీచ్ పైలాన్ వద్ద స్థానిక ప్రెస్ క్లబ్, ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆఫ్ భీమిలి, స్నిగ్ధ శ్రీదేవి ఫౌండేషన్ ఆధ్వర్యాన మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ఉత్సాహంగా స్థానిక మహిళలు పాల్గొన్నారు. అనంతరం విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు ముత్తంశెట్టి మహేష్, గంటా నూకరాజు, మైలపల్లి షణ్ముఖ రావు, గాడు అప్పల నాయుడు, వై.అనిల్ ప్రసాద్, కె.రామానాయుడు పాల్గొన్నారు.










