Oct 29,2023 01:04
సమస్యలు తెలుసుకుంటున్న డాక్టర్‌ ఉగ్ర

ప్రజాశక్తి-కనిగిరి: ప్రజా సమస్యలు పట్టని వైసీపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని టిడిపి కనిగిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కోరారు. కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని చింతలపాలెం గడ్డమీదపల్లిలో శనివారం ఉదయం మన ఊరు-మన ఉగ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును, ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ ముందుకు సాగారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వారిని చైతన్యపరుస్తూ కార్యక్రమంలో పాల్గొన్నారు. కనీస వసతులైన నీటి సమస్య కూడా పరిష్కరించలేని దుస్థితిలో ప్రభుత్వం, పాలకులు ఉన్నారంటే ప్రజల మీద ఈ ప్రభుత్వానికి ఏమేర ఆసక్తి ఉందో ఇట్టే తెలిసిపోతోందని అన్నారు. చంద్రబాబునాయుడు నిర్దోషిగా కడిగిన ముత్యం వలె జైలు నుంచి బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు నంబుల వెంకటేశ్వర్లు, నాయకులు, రాజమళ్ల శ్రీనివాసరెడ్డి, ముచ్చుమారి చెంచిరెడ్డి, షేక్‌ ఫిరోజ్‌, షేక్‌ అహ్మద్‌, తమ్మినేని వెంకటరెడ్డి, షేక్‌ బారా ఇమామ్‌, బుడే సాహెబ్‌, తమ్మినేని సురేందర్‌రెడ్డి, పాలూరి సత్యం, చింతలపూడి తిరుపాలు, ఆర్‌వి నారాయణ, బాలు ఓబుల్‌ రెడ్డి, నంబుల కొండయ్య, నుదురుపాటి సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.
వెలిగండ్ల: టిడిపి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆదేశాల మేరకు పిఎన్‌ వరం గ్రామ పంచాయతీలో శనివారం పార్టీ సమావేశం నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పిఎన్‌ వరం పంచాయతీలో 34వ బూత్‌లో 1,116 ఓట్లకి గాను ప్రతి 120 ఓట్లకు ఒక నాయకుడిని గ్రామ పార్టీ సమావేశంలో ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు ముత్తిరెడ్డి వెంకటరెడ్డి, నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు కేలం ఇంద్రభూపాల్‌రెడ్డి, కర్నాటి భాస్కర్‌రెడ్డి, మోటాటి సుబ్బారెడ్డి, కారెంపూడి వెంకటేశ్వర్లు, పిన్నిక బాలకోటయ్య, మీనిగ కాశయ్య, గోనా వెంకటయ్య, గ్రామ పార్టీ అధ్యక్షులు గాజుల వెంకటేశ్వర్లు, తుమ్మ వెంకటరత్నం, కీసరి రమణారెడ్డి, ముక్కు శ్రీనివాసులురెడ్డి, మన్నెపల్లి రవిశెట్టి కోదండ రాములు, కళ్లు వెంకటేశ్వర్లు, మల్లిఖార్జున, పంచాయతీలోని టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.