Jul 25,2023 00:38
ఎంపిడిఒకు అర్జీ ఇస్తున్న ప్రజలు

ప్రజాశక్తి-నగరం: గ్రామాల్లో సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడు తున్నా పంచాయతీ కార్య దర్శులు పట్టించుకోవడం లేదని, వారిపై చర్యలు తీసుకోవాలని మండలంలోని అద్దంకివారిపాలెం, మంత్రిపాలెం, పెద్దవరం గ్రామాలకు సంబంధించిన వార్డు మెంబర్లు సోమవారం ఎంపిడిఒకు ఫిర్యాదు చేశారు. గ్రామాల్లో ప్రజలు మంచినీరు లేక, వీధి దీపాలు వెలగక అనేక ఇబ్బందులు పడుతున్నా పంచాయతీ కార్యదర్శులు పట్టించుకోవడం లేదన్నారు. వారి పైన వెంటనే చర్యలు తీసుకోవాలని ఈరోజు నగరం ఎంపిడిఒను కలిసి వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ నగరం మండలం అధ్యక్షుడు విచారపు వీరయ్య, మాజీ జడ్పిటిసి సభ్యులు మేకా శివరామకృష్ణ, అద్దంకివారిపాలెం గ్రామ సర్పంచ్‌ విచారపు పావని, మంత్రిపాలెం గ్రామ సర్పంచ్‌ ప్రమీల, పెద్దవరం గ్రామ సర్పంచ్‌ హారేరామ్‌, నగరం మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.