Sep 04,2023 23:55
తహశీల్దార్‌ కార్యాలయంలో వినతిపత్రం అందిస్తున్న సిపిఎం జిల్లా కార్యదర్శి గంగయ్య, నాయకులు

ప్రజాశక్తి-బాపట్ల: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్య లను పరిష్కరిం చాలని కోరుతూ సోమవారం సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహిం చారు. సిపిఎం సమరభేరి కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 30 నుంచి ఈ నెల 4వ తేదీ వరకు పలు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. చివరి రోజైన సోమవారం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని డిప్యూటీ తహశీల్దార్‌ ధనలక్ష్మికి అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా సిపిఎం కార్యదర్శి గంగయ్య మాట్లాడుతూ నిరుద్యోగం, విద్యుత్‌ చార్జీలు, అధిక ధరలతో ప్రజలు సతమతమవుతున్నారని అన్నారు. ధరలు పెరుగుదలపై ప్రజల గోడు పాలకులకు పట్టడం లేదు. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో గ్యాస్‌ సిలిండర్‌కు కేవలం రూ.200 మాత్రమే కంటి తుడుపుగా తగ్గించారు. ప్రభుత్వాలు ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను పరిష్కరించే వరకు పోరాటం తప్పదని అన్నారు. ధరలు తగ్గించే దిశగా ప్రభుత్వాలు కృషి చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్‌ నాయకులు నూతలపాటి కోటేశ్వరరావు, వై భాస్కరరావు, ఉప్పరపాలెం పార్టీ శాఖ కార్యదర్శి షేక్‌ మహబూబ్‌ సుభాని, ఐద్వా జిల్లా నాయకురాలు టి సుభాషిణి, దినేష్‌ పాల్గొన్నారు.