Sep 01,2023 20:53

మదనపల్లె : నిరసన తెలుపుతున్న సిపిఎం నాయకులు

రాయచోటి టౌన్‌ : ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారం కోసమే సచివాలయాల్లో వినతి పత్రాలు ఇచ్చినట్లు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎ. రామాంజులు పేర్కొన్నారు. సమరభేరిలో భాగంగా ఆగస్టు 30, 31 తేదీల్లో ప్రజా సమస్యలపై సేకరించిన సంతకాల పత్రాలను శుక్రవారం 1,2,3,4,7 సచివాలయాల్లో అడ్మిన్‌ వెల్ఫేర్‌, కౌన్సిర్లకు ఇచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజలపై అనేక భారాలు మోపుతోందని పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమం కోసం ఉన్న చట్టాలు రద్దు చేసి లేబర్‌ కోడ్‌లు తేవడమేగాక ఉన్న ఉద్యోగాలు తొలగిస్తూ భవిష్యత్‌లో నిరుద్యోగ సమస్యను తీవ్రం చేశారని చెప్పారు. రాష్ట్రాల హక్కులను ఆదాయాలు హరించే విధంగా బిజెపి ప్రభుత్వం వ్యవహరిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించకపోగా సమర్తిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రజల భవిష్యత్‌ పై ఆందోళనతో సిపిఎం సమరభేరి పేరుతో ప్రజా సమస్యలను క్షేత్ర స్థాయిలో పరిష్కరించి ప్రజలను మేలుకొల్పాలని ఆందోళన బాట పట్టిందన్నారు. విద్యుత్‌, ఆర్‌టిసి, చెత్త, ఇంటి, ఆస్తి పన్నులను రద్దు చేయాలని, నిరుద్యోగభృతి ఇవ్వాలని, పరిశ్రమలు నెలకొల్పాలని, మౌలిక వసతులైన సిసి రోడ్లు, విద్యుత్‌ దీపాలు, మరుగుదొడ్లు, ఇళ్ల నిర్మాణాలు, డ్రెయినేజీ కాల్వల వంటి సమస్యలను అధికారులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. 4న మండల కేంద్రం వద్ద ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఫయాజ్‌, మాధవయ్య, శేఖర్‌నాయక్‌, ఓబులేసు, ఈశ్వరయ్య, హుసేన్‌, సలీమ్‌ పాల్గొన్నారు. మదనపల్లె అర్బన్‌: ప్రజా సమస్యలు తక్షణం పరిష్కరించాలని సిపిఎం పట్టణ కార్యదర్శి డి.ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ సిపిఎం చేపట్టిన దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా శుక్రవారం మదనపల్లిలోని పలుసచివాలయాల్లో ప్రజల సంతకాలతోకూడిన వినతిపత్రాలు సమర్పించారు. అధికధరలు తగ్గించాలని, నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని, ప్రజలకు తాగునీరు సక్రమంగా అందించాలనీ, పెట్రోలు, డీజిల్‌, కరెంటు ఛార్జీలు తగ్గించాలని డిమాండు చేస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాము ఇచ్చిన వాగ్దానాలను మరిచి ప్రజలపై భారాలు మోపుతున్నాయన్నారు. దేశంలో 10 సంవత్సరాలలో లేని విధంగా నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయని, నిరుద్యోగం 45 శాతం పెరిగిందన్నారు. ఇంటి పన్నులు, చెప్తున్నారు పెంచారని, ప్రజల జీతభత్యాలు మాత్రం పెరగడంలేదని, కనీసవేతనాలు కూడా ఇవ్వడం లేదన్నారు. మదనపల్లి శివారు ప్రాంతాల్లో మురికికాల్వలు అధ్వాన్నంగా ఉన్నాయని, చాలాచోట్ల మంచినీరు అందడంలేదని, రోడ్ల పరీస్థితి మరీ అధ్వాన్నమైందని, శాంతిభద్రతలు క్షీనించాయని వాపోయారు. చేనేతకార్మికులు,చేతివ త్తులవారి జీవితాలు బజారున పడ్డాయని, ఆటోకార్మికులు, టాక్సీడ్రైవర్లు పలు బాధలు అనుభవిస్తున్నారని, ప్రభుత్వరంగ సంస్థలను అమ్మి కార్పోరేట్లు సేవ చేసే ప్రభుత్వానికి ప్రజా సేవలో శ్రధ్ధలేదన్నారు. ప్రభుత్వాలు ఇప్పటికైన కళ్ళుతెరచి అందరినీ ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు వెంకటేష్‌, జయరాం, రఘునాథ్‌, నాయుడన్న సుందరం, శివ, పవన్‌ పాల్గొన్నారు.