
ప్రజాశక్తి-నగరి:
ప్రజా సమస్యలపై ఉమ్మడిగా పోరాడదామని టిడిపి నగరి నియోజకవర్గ ఇంఛార్జ్ గాలి భానుప్రకాష్ ఆ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. శుక్రవారం నగరి పార్టీ కార్యాలయంలో టీడీపీ, జనసేన నాయకులు ఆత్మీయ సమన్వయ సమావేశం నిర్వహించారు. సమావేశంలో జనసేన పార్టీ నగరి ఇన్చార్జి మహేష్, నాయకులు పాల్గొన్నరు. ఈ సందర్భంగా గాలి భాను ప్రకాష్ మాట్లాడుతూ ఏ తప్పు చేయని చంద్రబాబును 52 రోజులు రిమాండ్‌లో ఉంచారని, ఇది కేవలం రాజకీయ కక్షతోనే జరిగిందని తెలిపారు. టీడీపీ, జనసేనల కలయికతో ప్రజలు హర్షిస్తున్నారని, ఆశీర్వదిస్తారని తెలిపారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు కరువయ్యాయని, పరిశ్రమలు రావడం లేదని, పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్లిపోతున్నాయని, రాష్ట్రాన్ని అదోగతి పాలు చేశారని అవేదన వ్యక్తం చేశారు. పుత్తూరులో జగన్ రెడ్డి ఎన్నికల సమావేశం అప్పుడు విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని, మరమగ్గ కార్మికులకు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పారని, అలాగే మద్య నిషేదం చేస్తామని చెప్పి,నేడు ప్రభుత్వాన్ని మద్యం పై వచ్చే ఆదాయంతో నడిపిస్తున్నారని తెలిపారు. సమావేశంలో నాయకులు మాధవయ్య, బాలాజీ, ధనంజేయనాయుడు, లక్ష్మి ప్రసన్న, రమేష్ బాబు, శివకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎస్‌ఆర్ పురం:
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలుపేలక్ష్యంగా పనిచేయడానికి కార్యకర్తలు సిద్ధపడాలని టిడిపి, జనసేన నాయకులు అన్నారు. శుక్రవారం ఎస్‌ఆర్ పురం టిడిపి కార్యాలయంలో శుక్రవారం టిడిపి మండల అధ్యక్షుడు జయశంకర్‌నాయుడు అధ్యక్షతన ఉమ్మడి పార్టీ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి టిడిని, జనసేన నియోజకవర్గ ఇంచార్జ్‌లు డాక్టర్ థామస్, యుగంధర్ హాజరైయ్యారు. డిప్యూటి సిఎం నారాయణస్వామిపై తీవ్ర విమర్శలు చేశారు.