
* టిడిపి, జనసేన సమన్వయ కమిటీ నిర్ణయం
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: ప్రజా సమస్యలపై ఉమ్మడి పోరాటం సాగిస్తామని మాజీ ఎమ్మెల్యే, టిడిపి నాయకులు గుండ లకీëదేవి, జనసేన శ్రీకాకుళం నియోజకవర్గ ఇన్‌ఛార్జి కోరాడ సర్వేశ్వరరావు తెలిపారు. అరసవల్లిలోని ఒక ఫంక్షన్ హాల్‌లో టిడిపి, జనసేన నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసిపి అరాచక పాలనతో ప్రజలు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమం పేరిట ప్రజలపై పెద్దఎత్తున భారాలు మోపారని విమర్శించారు. వైసిపి అరాచక పాలనకు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కలసికట్టుగా పనిచేసి వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తామన్నారు. సమావేశంలో టిడిపి, జనసేన నాయకులు పాల్గొన్నారు.