ప్రజాశక్తి-పలమనేరు: ప్రజా సమస్యలపై స్పందించి, వార్తల రూపంలో అందించి, సమస్య పరిష్కారం దిశగా ప్రయత్నించే వారే నిజమైన జర్నలిస్ట్ అని ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు మునిరత్నం అన్నారు. పలమనేరులోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. జర్నలిజం అనేది, అక్రిడేషన్‌కి పరి మితం కాకూడదన్నారు. స్వార్థం, వివక్ష లేకుండా సమైక్య భావంతో మెలగాలని సూచించారు. అన్ని పత్రికలతో పాటు సోషల్ మీడియా కూడా ప్రధానమైనదేనన్నారు. జర్నలిజం అంటే జనానికి అండగా నిలబడే ఓ బలమైన ఆయుధంగానే ఉండాలన్నారు. ప్రధాన కార్యదర్శి శివకుమార్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో సోషల్ మీడియా అతి బలమైనది కాబోతోందన్నారు. సమస్యలు ఎదురైనప్పుడు జర్నలిస్టులు ఐక్యం కావాల్సి ఉందని మానవ హక్కుల సంఘం నాయకులు మునిరత్నం, రాజా పేర్కొన్నారు.










