ప్రజా సమస్యలపై పోరాడుతున్న
పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించండి
ప్రజాశక్తి - ఆత్మకూర్
ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న పిడిఎఫ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ పోతుల నాగరాజు, టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి లకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి, వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని డివైఎఫ్‌ఐ మాజీ జిల్లా అధ్యక్షుడు ఏ. రణధీర్, సిఐటియు పట్టణ కార్యదర్శి డి.రామ్ నాయక్‌లు కోరారు. బుధవారం పట్టణంలోని రాజా వీధి, ఏబీఎం పాలెం, ఎస్ పి జి పాలెం, కొత్తపేట, స్వరాజ్ నగర్, వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మండలంలోని వెంకటాపురం గ్రామంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు నరసింహ నాయక్, కెవిపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి భాస్కర్, న్యాయవాది అంకిరాజు, మహిళా సంఘం నాయకురాలు శివమ్మ, వృతిదారుల సంఘం జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు ఎన్నికల ప్రచార నిర్వహించారు. శ్రీశైలం ప్రాజెక్టు : పోతుల నాగరాజు, కత్తి నరసింహారెడ్డిలను గెలిపించాలని శ్రీశైలం మండలంలోని లింగాల గట్టు గ్రామంలో సిఐటియు నంద్యాల జిల్లా కమిటీ సభ్యులు మునిపాటి చిన్న మారెన్న, మండల అధ్యక్షులు దర్శనం నాగరాజు, సహాయ కార్యదర్శి మల్లికార్జున ప్రచారం నిర్వహించారు.
నందికొట్కూరు : పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల నాగరాజును, టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డిలను గెలిపించాలని మునిసిపాలిటీలో సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం, ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో బసిరెడ్డి, సాయిరాం కళాశాల్లో, సిఎస్‌ఐ పాలెం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం నాగేశ్వరరావు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు కే భాస్కర్ రెడ్డి, ఏపీ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రజా సమస్యల కోసం పోరాటం చేస్తున్న పోతుల నాగరాజుకు 27వ సీరియల్ నెంబర్ ఎదురుగా 1 అంకెను వేసి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని వారు కోరారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ మాజీ నాయకుడు నాయక్, ఎరుకలి రాజు, రాజేష్, మధు సూదన్, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.
వైసిపికి ఓటు అడిగే అర్హత లేదు : వ్యకాస
ఉద్యోగులు, ఉపాధ్యాయులను మోసం చేసిన వైసీపీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అడిగే అర్హత లేదని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఫకీర్ సాహెబ్, మాజీ ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడు పుల్లన్న, వ్యవసాయ కార్మిక సంఘం మండల ఉపాధ్యక్షులు వేణుగోపాల్ అన్నారు. బుధవారం మండలంలోని బ్రాహ్మణకొట్కూరు, వడ్డెమాను, కోనేటిమపల్లె, గ్రామాలలో ఉన్న స్కూల్స్, సచివాలయాలు, ప్రైవేట్ స్కూళ్లలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల సమస్యలు శాసనమండలిలో చర్చకు రావాలంటే పిడిఎఫ్ అభ్యర్థులు గెలవాల్సిన అవసరం ఉందన్నారు. కొత్తపల్లి:ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మికులు చేస్తున్న పోరాటాలకు అండగా నిలుస్తున్న పిడిఎఫ్ అభ్యర్థులు పోతుల నాగరాజు, కత్తి నరసింహారెడ్డిలకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎన్ స్వాములు, మాజీ ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు బొల్లు ప్రసాద్ యాదవ్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మండల కేంద్రంలోని కొత్తపల్లిలో పిడిఎఫ్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పాములపాడు : పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల నాగరాజును గెలిపించాలని రైతు సంఘం జిల్లా నాయకులు బి రామేశ్వరరావు, కౌలు రైతు సంఘం జిల్లా నాయకులు సామన్న, రైతు సంఘం మండల కార్యదర్శి వెంకటేశ్వరరావు, సిఐటియు నాయకులు హనుమంతు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఏసేపు, ఎస్సార్ రమణ, రైతు సంఘం నాయకులు బాల యేసు ప్రచారం నిర్వహించారు. ప్రజా సమస్యల పట్ల, ఉద్యోగ ,నిరుద్యోగ సమస్యల పట్ల అవగాహన కలిగి నిరంతరం సమస్యల పట్ల పనిచేస్తున్న పోతుల నాగరాజును తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.










