ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వీడాలి - డివైఎఫ్ఐ
ప్రజాశక్తి - నంద్యాల
ప్రజా సమస్యల పైన మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం విడాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లక్ష్మణ్ డివైఎఫ్ఐ నంద్యాల పట్టణ కార్యదర్శి ఎస్. శివ పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం వారు మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో పలుచోట్ల పైప్లైన్ సమస్య ఉందని చెప్పి రోడ్డు పగలగొట్టి పైప్లైన్ మరమ్మతులు పూర్తి చేశారు కానీ పగలగొట్టిన రోడ్లను మరమ్మతులు చేయకుండా వదిలివేశారని అన్నారు. ప్రధానంగా టెక్కే,బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ దగ్గర అదే విధంగానే ఎమ్మార్వో ఆఫీస్ దగ్గర ఉన్న సుబ్రహ్మణ్యం కాంప్లెక్స్ ఎదుట, సాయిబాబా నగర్ దగ్గర ఉన్న భగత్ సింగ్ గ్రంధాలయం దగ్గర పైప్ లైన్ సమస్యలు ఉన్నాయని రోడ్లను పగలగొట్టి క్రేన్ లతో మట్టి తీసి పైప్లైన్ మరమ్మతులు చేపట్టారు కానీ మరమ్మతులు పూర్తి అయిన రెండు నెలలు పూర్తి కావస్తున్న పగలగొట్టిన రోడ్లపై మన్ను కప్పి వదిలివేయడం జరిగిందన్నారు . ప్రస్తుతం వర్షాలు పడడం వలన మన్నుతో కప్పిన రోడ్డుపై వర్షం పడడం వలన బురదగా ఏర్పడడం గుంతలో నీళ్ళు నిలవడం జరుగుతుందని దీనివలన వాహనం దారులు రోడ్డుపై వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.పైప్లైన్ సమస్య వలన పగలగొట్టిన రోడ్లను పూర్తి చేయవలసిన బాధ్యత మున్సిపల్ అధికారులపై లేదా అని ప్రశ్నిస్తున్నామని అన్నారు. పగలగొట్టిన రోడ్లపై సిమెంట్ రోడ్డు వేయాలని ప్రజా సమస్యలు పట్టించుకోవాలని దీనిపై మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వీడి సంబంధిత అధికారులతో మాట్లాడి రోడ్లు మరమ్మతులు చేపట్టాలని లేని పక్షాన భారత ప్రజాతంత్ర యువజన సమైక్య (డివైఎఫ్ఐ) తరపున ప్రజలను విద్యార్థులను వాహనదారులు ను కలుపుకొని ఆందోళన చేపట్టవలసి వస్తుందని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లక్ష్మణ్ డివైఎఫ్ఐ నంద్యాల పట్టణ కార్యదర్శి శివ తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు సంజయ్, సాయి, విజయ్, రమణ, వినీత్, తదితరులు పాల్గొన్నారు.










