Sep 24,2023 23:22

గుంటూరులో మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు

ప్రజాశక్తి - తాడేపల్లి రూరల్‌ : ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం సమస్యలపై అధ్యయనం చేసి, పరిష్కారం కోసం కషి చేసిన గొప్ప ఆదర్శ నాయకుడు కొరటాల సత్యనారాయణ అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలోని కామ్రేడ్‌ కొరటాల సత్యనారాయణ, గుంటూరు బాపనయ్య భవన్‌లో కొరటాల సత్యనారాయణ శత జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. కొరటాల సత్యనారాయణ చిత్రపటానికి వి.శ్రీనివాసరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 1923 సెప్టెంబర్‌ 24న తెనాలి ప్రాంతం, అమతలూరులో జన్మించిన కొరటాల సత్యనారాయణ విద్యార్థి దశనుండే అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారని, నిర్బంధాలు, ఆటుపోట్లను ఎదుర్కొని చివరి వరకూ ఆదర్శ కమ్యూనిస్టుగా జీవించారని చెప్పారు. పుచ్చలపల్లి సుందరయ్య తర్వాత సిపిఎం ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లారన్నారు. కొరటాల సత్యనారాయణ శత జయంతి ఉత్సవాలను ఏడాది పాటు జరపనున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం కమ్యూనిస్టు ఉద్యమంపై, నిర్బంధాలు ఉధతంగా ఉన్నాయని, వర్గ పోరాటాలు వర్గ సంఘాల ద్వారానే కమ్యూనిస్టు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నారు. బంజర భూములు, చల్లపల్లి జమిందారికి వ్యతిరేకంగా కొరటాల నడిపిన కూలి పోరాటాలను ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలన్నారు. కమ్యూనిస్టు ఉద్యమంలో మరొక అరుణ తారగా నిలిచిన గుంటూరు బాపనయ్య నడిపిన సామాజిక ఉద్యమాలు, పోరాటాలను గుర్తు చేశారు. 1964, 1965లో పార్టీ చీలినప్పుడు పార్టీ పున: నిర్మాణంలో కొరటాల సత్యనారాయణ కీలక పాత్ర పోషించారని, పార్టీ, ప్రజా సంఘాలతో పాటు ప్రజాశక్తి అభివద్ధికి కొరటాల సత్యనారాయణ కషి మరువలేనిదని వివరించారు. మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ, సమస్యలను అధ్యయనం చేయడం ద్వారానే వాటి పరిష్కారానికి కొరటాల సత్యనారాయణ కషి చేసేవారని, రైతు సమస్యలు అధ్యయనం చేయడంతో పాటు, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో రైతు ఆత్మహత్యలపై స్వయంగా పరిశీలించారని చెప్పారు. పార్టీ కార్యకర్తలతో ఆప్యాయంగా మెలుగుతూ స్ఫూర్తి నింపేవారని, ఆయన స్ఫూర్తితో ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య మాట్లాడుతూ కొరటాల స్యతనారాయణ జాతీయోద్యమంలో, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్నారని గుర్తు చేశారు. భూస్వామ్య వర్గానికి వ్యతిరేకంగా నిలబడిన ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమన్నారు. ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.రమాదేవి మాట్లాడుతూ ఉద్యమాల్లో వచ్చే ఆటుపోట్లను ఎదుర్కొని ఎలా నిలబడాలో కొరటాల సత్యనారాయణ నుండి నేర్చుకోవాలని అన్నారు. గుంటూరు జిల్లాతో ప్రత్యేక అనుబంధం కలిగిన ఆయన.. కార్యకర్తలను అరేరు బాబు అంటూ ఆప్యాయంగా పలకరించే వారిని చెప్పారు. తాము విద్యార్థి దశ నుండి కొరటాల స్ఫూర్తితో పని చేశామన్నారు. ప్రజాశక్తి ఎడిటర్‌ బి.తులసిదాస్‌ మాట్లాడుతూ రైతు, వ్యవసాయ సమస్యలపట్ట పూర్తి అవగాహన ఉన్న నాయకుడు కొరటాల సత్యనారాయణ అని చెప్పారు. కొత్త విషయాలను ఎప్పటికప్పుడు నేర్చుకొని, అధ్యయనం చేసేవారని, ఆయన బహుముఖ కషివలుడని అన్నారు. రైతు సంఘం సీనియర్‌ నాయకులు వై.కేశవరావు మాట్లాడుతూ రైతు సమస్యలపై నిరంతరం పని చేసిన కొరటాల సత్యనారాయణ ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నుండి నిధులు రాబట్టడంలో ఎంతో కృషి చేసేవారన్నారు. రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి హరిబాబు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కొరాటాల సత్యనారాయణ కృషిని శత జయంతి ఉత్సవాల ద్వారా ప్రజలకు తెలిజెప్పాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి, సిఐటియు రాష్ట్ర నాయకులు కె.ఉమామహేశ్వరరావు, డివైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న, కౌలు రైతు సంఘం రాష్ట్ర అద్యక్షులు వై.రాధాకష్ణ, రైతు సంఘం తాడేపల్లి మండల నాయకులు డి.వెంకటరెడ్డి, కె.శివరామకష్ణయ్య, ఎం.శ్రీనివాసరెడ్డి, సిఐటియు నాయకులు వి.దుర్గారావు, బి.వెంకటేశ్వరరావు, ఐద్వా నాయకులు డి.శ్రీనివాసకుమారి, శాంతి, పి.గిరిజ, పాల్గొన్నారు.
ప్రజాశక్తి - గుంటూరు : కొరటాల సత్యనారాయణ ఆశయాలను, లక్ష్యాలను కొనసాగించడమే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి అని సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు అన్నారు. కొరటాల సత్యనారాయణ శత జయంతి ఉత్సవాల ప్రారంభ సందర్భంగా ఆదివారం బ్రాడీపేటలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో ఆయన చిత్ర పటానికి సిపిఎం సీనియర్‌ నాయకులు ఎన్‌.వేణుగోపాలరావు, ఎమ్‌.డి అక్బర్‌ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ కొరటాల సత్యనారాయణ తన జీవితాంతం పేదల అభ్యున్నతి కోసం కృషి చేశారన్నారు. శాసన సభ్యునిగా రెండుసార్లు ఎన్నికై రైతులు, వ్యవసాయ కార్మికుల సమస్యలను చట్టసభల్లో మాట్లాడారని చెప్పారు. చేనేత కార్మికుల సమస్యలను అధ్యయనం చేసి అవి పరిష్కారమయ్యే వరకూ దశల వారీగా ఆందోళన చేశారన్నారు. లంకభూములను భూస్వాములు ఆక్రమించుకోగా పేదలను కదిలించి ఆందోళన చేసి వందలాది ఎకరాలు పేదలకు దక్కే విధంగా సొసైటీలను ఏర్పాటు చేశారని తెలిపారు. జిల్లాలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని అతివాద, మితవాద, విచ్ఛిన్నకర శక్తుల నుండి కాపాడి పార్టీని అభివృద్ధి చేశారన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.నేతాజి మాట్లాడుతూ విద్యార్థి, యువజన ఉద్యమాలపై కొరటాల సత్యనారాయణ ప్రత్యేక శ్రద్ధ పెట్టేవారని, యువతను ప్రోత్సహించేవారని అన్నారు. రైతు రక్షణ వేదిక కన్వీనర్‌ ప్రొఫెసర్‌ వేణుగోపాలరావు మాట్లాడుతూ చిన్న రైతులు, వ్యవసాయ కూలీల సమస్యలపై లోలైన అధ్యయనం చేశారని, చేనేత కార్మికుల ఆత్మహత్యలపై పరిశీలన చేసి ప్రభుత్వానికి నివేదిక నిచ్చి పరిష్కారానికి కృషి చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్‌ిశవర్గ సభ్యులు ఎన్‌.భావన్నారాయణ, కె.నళినీకాంత్‌, ఇ.అప్పారావు, నాయకులు బి.లక్ష్మణరావు, వి.వి.కె. సురేష్‌, కె.అజరుకుమార్‌, బి.శ్రీనివాసరావు, ఖాశింషహీద్‌, వై.కృష్ణ పాల్గొన్నారు.
ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలోని కోటప్పకొండ రోడ్డులో ఉన్న పల్నాడు విజ్జాఞన కేంద్రంలో కొరటాల సత్యనారాయణ చిత్రపటానికి నాయకులు పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభకు డి.శవకుమారి అధ్యక్షత వహించారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎ.లకీëశ్వరరెడ్డి మాట్లాడుతూ భూస్వామ్య కుటుంబంలో జన్మించిన కొరటాల సత్యనారాయణ పీడిత ప్రజల పక్షాన నిలిచి పోరాటాలు చేశారని అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పుచ్చలపల్లి సుందరయ్య, మాకినేని బసవపున్నయ్య వంటి నాయకులతో కలిసి పని చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో కె.రామారావు, సిలార్‌ మసూద్‌, ఆంజనేయరాజు, మస్తాన్‌వలి, సుభాని, ఫాతిమా పాల్గొన్నారు.
ప్రజాశక్తి-సత్తెనపల్లి : చేనేత రంగ సమస్యల పరిష్కారానికై కొరటాల సత్యనారాయణ చేసిన కృషి మరువలేనిదని సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు కె.శివదుర్గారావు అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని పుతుంబాక భవన్‌లో కొరటాల సత్యనారాయణ శతజయంతిని నిర్వహించారు. కార్యక్రమానికి సిపిఎం పట్టణ కార్యదర్శి డి.విమల అధ్యక్షత వహించగా తొలుత కొరటాల సత్యనారాయణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శివదుర్గారావు మాట్లాడుతూ కొరటాల సత్యనారాయణ విద్యార్థి దశలోనే రాజకీయాలకు ఆకర్షితులై స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారని, ఆ తర్వాత వామపక్ష రాజకీయాలకు ఆకర్షితులైన తెలంగాణ సాయుధ పోరాటంలోనూ పాల్గొన్నారని చెప్పారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా, కేంద్ర కమిటీ సభ్యులుగా, పొలిట్‌ బ్యూరో సభ్యులుగా పనిచేశారని అన్నారు. 1962లో వేమూరు నియోజకవర్గం నుండి, 1978 రేపల్లె నియోజకవర్గం నుండి సిపిఎం అభ్యర్థిగా గెలిచి పేదల పక్షాన అసెంబ్లీలో గళం వినిపించారన్నారు. కార్యక్రమంలో నాయకులు ఆర్‌.పురుషోత్తం, ఎ.వీరబ్రహ్మం, పి.ప్రభాకర్‌, జి.సుసులోవ్‌, ఎం.జగన్నాథరావు, పి.సూర్యప్రకాశరావు, షేక్‌ సిలార్‌ మసూద్‌ పాల్గొన్నారు.
ప్రజాశక్తి - చిలకలూరిపేట : స్థానిక పండరిపురంని సిపిఎం కార్యాలయంలో కొరటాల సత్యనారాయణ చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. సీనియర్‌ నాయకులు బి.శంకరరావు మాట్లాడుతూ 1978లో యడ్లపాడు మండలం లింగారావుపాలెంలో రాజకీయ శిక్షణా తరగతుల కోసం వచ్చినప్పుటి సందర్భాలను గుర్తు చేశారు. ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ కొరటాల సత్యనారాయణ జీవితాంతం పేదల కోసం పాటుపడ్డారన్నారు. సిపిఎం పట్టణ కార్యదర్శి పి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కొరటాల సత్యనారాయణతో కలిసి పని చేసిన సందర్భాలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో నాయకులు ఎస్‌.బాబు, ఎం.విల్సన్‌, పి.భారతి, బి.లక్ష్మణ్‌, పి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ప్రజాశక్తి - యడ్లపాడు : మండల కేంద్రమైన యడ్లపాడులోని పిఆర్‌ విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన సభకు సిపిఎం మండల కన్వీనర్‌ టి.కోటేశ్వరరావు అధ్యక్షత వహించారు. కొరటాల సత్యనారాయణ చిత్రపటానికి సీనియర్‌ నాయకులు ఎన్‌.తులశయ్య, పి.సుబ్బారావు పూలమాలలేసి నివాళులర్పించారు. కె.రోశయ్య, జె.శంకరరావు, గురుస్వామి, ఎ.సుబ్బారావు పాల్గొన్నారు.