ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజాశక్తి దినపత్రిక అంకిత భావంతో పనిచేస్తుందని పల్నాడు జిల్లా కలెక్టర్ ఎల్.శివశంకర్ అన్నారు. ప్రజాశక్తి 43వ వార్షికోత్సవం, స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రచురించిన ప్రత్యేక సంచికను కలెక్టరేట్‌లోని స్పందన హాలులో జిల్లా కలెక్టర్, జెసి, ఇతర అధికారులు బుధవారం ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ కార్మికులు, కర్షకులు సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి ప్రభుత్వం డృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంలో ప్రజాశక్తి శక్తివంతం లేకుండా పనిచేయటం స్ఫూర్తిదాయకమని అన్నారు. జాయింట్ కలెక్టర్ ఎ.శ్యాం ప్రసాద్ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజాశక్తి చేస్తున్న కృషి అభినందనీయమని, పత్రిక మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.










