Aug 20,2023 23:46

సమావేశంలో మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు

ప్రజాశక్తి-తాడేపల్లి : దేశంలో, రాష్ట్రంలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలపై 25న గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సభను నిర్వహిస్తున్నట్లు సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు తెలిపారు. సభకు ముఖ్య అతిథిగా సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు హాజరై వివిధ అంశాలపై వివరిస్తారని చెప్పారు. ఈ మేరకు ఉండవల్లిలోని సిపిఎం కార్యాలయం, తాడేపల్లిలోని మేకా అమరారెడ్డి భవన్‌లో సిపిఎం విస్తృత సమావేశాలు ఆదివారం నిర్వహించారు. ఉండవల్లిలో సమావేశానికి సిపిఎం రాజధాని డివిజన్‌ కార్యదర్శవర్గ సభ్యులు వల్లభాపురం వెంకటేశ్వరరావు, తాడేపల్లిలో సభకు సిపిఎం పట్టణ కార్యదర్శివర్గ సభ్యులు డి.శ్రీనివాసకుమారి అధ్యక్షత వహించారు. రామారావు మాట్లాడుతూ ఢిల్లీలో సిపిఎం కేంద్ర కార్యాలయానికి ఢిల్లీ పోలీసులు తాళం వేయడాన్ని నిరసించారు. కార్యాలయంలో మూడ్రోజుల పాటు జరుగుతున్న దేశంలోని అభ్యుదయ వాదుల సమావేశాన్ని జరగకుండా చూడటమే బిజెపి ఉద్దేశమ న్నారు. అందులో భాగంగానే పోలీసులను ఉసిగొల్పి ఓ జాతీయ పార్టీ కార్యాలయానికి తాళాలు వేయించిందని మండిపడ్డారు. ప్రజల సమస్యలను గాలికొదిలేసి, నిత్యావసర వస్తువుల ధరలను అడ్డగోలుగా పెంచిందని విమర్శించారు. వీటికి తోడు పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరల మంట మండించిందన్నారు. విద్యుత్‌ అదనపు ఛార్జీల పేరుతో కొత్త రకం దోపిడీకి తెరదీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి విధానాలను యథావిధిగా రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వం అమలు చేస్తోందని, విమర్శి ంచారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొ రేట్లకు అప్పగించడం మోడీ మానుకో వాలన్నారు. సిపిఎం రాజధాని డివిజన్‌ కార్యదర్శి ఎం.రవి, సిపిఎం తాడేపల్లి పట్టణ కార్యదర్శివర్గ సభ్యులు జి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ రాజధానికి నిధులు కేటాయించని కేంద్ర ప్రభుత్వాన్ని అధికార, ప్రతిపక్ష పార్టీలు నిలదీయడంలో విఫలమయ్యాయని అన్నారు. బిజెపి ప్రమాదాన్ని 80 ఏళ్ల క్రితం పశ్చిమ బెంగాల్‌లోని గురుగ్రాంలో సుభాష్‌ చంద్రబోస్‌ వివరించారని తెలిపారు. సమా వేశాల్లో వీరవెంకయ్య, సిహెచ్‌. సుందర రావు, ఎస్‌కె పీరూసాహెబ్‌, బాబూరావు, కె.కరుణాకరరావు, ఎస్‌.ముత్యాలరావు, డివి భాస్కరరెడ్డి పాల్గొన్నారు.