Mar 09,2023 00:42
గుల్లపల్లి గ్రామంలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ మోపిదేవి

ప్రజాశక్తి-చెరుకుపల్లి: గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరిస్తున్నామని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు అన్నారు. మండల పరిధిలోని గుల్లపల్లి గ్రామంలో బుధవారం గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణరావు పాల్గొని ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని పేర్కొన్నారు. ఇంకా రావాల్సిన వారందరికీ సంక్షేమ పథకాలు మంజూరు చేస్తున్నామని ఎంపీ తెలిపారు. ఈ సందర్భంగా పలువురు తమ సమస్యలు తెలపగా వాటిని పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మండల పరిషత్‌ అధ్యక్షులు మట్టి దివాకర్‌ రత్న ప్రసాద్‌, జడ్పిటిసి సభ్యులు మర్రివాడ వెంకట పావని ప్రసాద్‌, మాజీ ఎంపీపీ చేన్ను కోటేశ్వరరావు, గ్రామ సర్పంచ్‌ చెన్ను శివ, ఎంపీడీవో బి శ్రీనివాసరావు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.