Sep 09,2023 23:21

ప్రజాశక్తి - పెంటపాడు
           ప్రజా సమస్యలను పరిష్కరించాలని సిపిఎం పెంటపాడు మండల కార్యదర్శి చిర్ల పుల్లారెడ్డి, అలంపురం శాఖ కార్యదర్శి వడ్డాఇ సన్యాసిరావు కోరారు. ఈ మేరకు మండలంలోని అలంపురం గ్రామ సచివాలయంలో గుమస్తాకు శనివారాం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా పుల్లారెడ్డి, సన్యాసిరావు మాట్లాడుతూ అధికారంలోకి రాకముందు వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మారుస్తానని, వ్యవసాయ పంటలకు మద్దతు రేటు ప్రకటిస్తానని చెప్పి మోడీ 2014లో మోడీ అధికారంలోకొచ్చాక ఆ హీమీలను విస్మరించారన్నారు. మోడీ అధికారంలోకొచ్చాక వ్యవసాయ రంగం అధోగతి పాలైందన్నారు. మోడీ పరిపాలనలో ప్రభుత్వ లెక్కల ప్రకారం సుమారు నాలుగు లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. ఈ ప్రభుత్వ హయాంలో నిత్యావసర వస్తువుల ధరలు, నిరుద్యోగ సమస్య, ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం, దళితులపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో లంకలపల్లి అప్పారావు, జక్కంపూడి బంగారయ్య, జక్కంపూడి పెంటారావు, కొప్పునీడి నాగేశ్వరరావు, కొమ్మూరి గోపీ, కొర్ర సూరిబాబు, సురేష్‌, సతీష్‌ పాల్గొన్నారు.