ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: ప్రజలకు సేవచేయమని ప్రభుత్వం మనకు ఉద్యోగాలు ఇచ్చిందని, ప్రజా సమస్యల అలసత్వం చేయకుండా పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు పేర్కొన్నారు. శనివారం ఉదయం ఐరాల మండలం ఎంపిడిఓ కార్యాలయం సమావేశం హాల్‌లో తహశీల్దార్ సుశీల, ఎంపిడిఓ నాగరాజలతో కలసి గత సెప్టెంబర్ 8న నిర్వహించిన జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమంలో ప్రజలు అందజేసిన సమస్యల అర్జీలపై సంబంధిత శాఖల అధికారులు తీసుకున్న చర్యలకు సంబంధించి పరిశీలించారు. ఈ సందర్భంగా జేసి మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాడానికి మనకు ప్రభుత్వం ఉద్యోగ అవకాశం కల్పించందని, ప్రజలసేవకు ఉపయోగించలే తప్ప వేరే వారికి ఉపయోగించడం మంచిపద్ధతి కాదన్నారు. జగనన్నకు చెబుదాం స్పందనలో ప్రజాసమస్యలపై ప్రజలు అందజేసిన అర్జీల పరిష్కారానికి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. చట్టపరంగా పరిష్కరించేటుగా ఉంటే వెంటనే పరిష్కరించాలని పరిష్కారం కాలేనిది అయ్యితే ఎందువల్ల పరిష్కారం కాలేదోన్న సమాచారాన్ని అర్జీదారునికి లేఖ ద్వారా తెలియజేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు వారంలో రెండు రోజులు బుధ, శుక్రవారాలలో మండలస్థాయిలో జగనన్నకు చెబుదాం, స్పందన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గత సెప్టెంబర్ 8న పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండల కేంద్రంలో నిర్వహించిన జగనన్నకు చెబుదాం, స్పందన కార్యక్రమంలో మండలంలోని ప్రజలు వివిధ రకాల సమస్యల పరిష్కారం కోసం 124మంది అర్జీదారుల అందజేసిన విషయం తెలిసిం దేనని, అర్జీదారుల సమస్యలను సంబంధిత అధికారులు క్షేత్రస్థా యిలో పరిశీలించి నాణ్యతతో నిర్ణీత గడువులోపల పరిష్క రించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందని అందులో భాగంగానే శనివారం అధికారులు సమస్యల అర్జీలపై తీసుకున్న చర్యలను పరిశీలించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ తహ శీల్దార్ సుధాకర్, వివిధ శాఖల మండలస్థాయి అధికారులు, విఆర్‌ఓలు, పంచాయతీ సెక్రెటరీలు తదితరులు పాల్గొన్నారు.










